GST కౌన్సిల్ కీలక నిర్ణయం.. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్‌ల ధరలు తగ్గుతాయ్..!
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అనేక ఉత్పత్తులు సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై GST భారం తగ్గించనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా GST (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా టీవీలు, ఎయిర్ కండిషనర్‌లు సహా అనేక ఉత్పత్తుల ధరలను తగ్గనున్నాయి.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది :
ప్రస్తుతం GST లో నాలుగు శ్లాబులు ఉన్నాయి. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం తో శ్లాబులు ఉన్నాయి. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఫలితంగా కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం ఏసీలు, మానిటర్లు, డిష్ వాషింగ్ మెషిన్‌లు, ప్రొజెక్టర్లు, 32 అంగుళాల కంటే పెద్ద టీవీలు ప్రస్తుతం 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి రానున్నాయి. PTI రిపోర్టు (Via TOI) ఆధారంగా మోడల్‌ను బట్టి ఎయిర్ కండిషనర్‌లపై సుమారు రూ.1500 నుంచి రూ.2000 వరకు తగ్గనుందని తెలుస్తోంది.
గొప్ప చర్య! :
ధరల తగ్గింపుతో సేల్స్ కూడా పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ప్రీమియం మోడల్స్, తక్కువ శక్తితో పనిచేసే మోడల్స్ పైనా కొనుగోలుదారులు దృష్టిసారించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బ్లూ స్టార్ MD త్యాగరాజన్ GST తగ్గింపులను గొప్ప చర్యగా అభివర్ణించారు. పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ఛైర్మన్ మనీష్ శర్మ సుమారు 6-7 శాతం ధరలు తగ్గుతాయని అంచనా వేశారు.
జీవన నాణ్యత మెరుగవుతుంది :
గోద్రెజ్ అబ్లయెన్సెస్ కు చెందిన కమల్ నంది ఈ చర్యను స్వాగతించారు. దేశంలో ఏసీల వినియోగం 9-10 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. జీవన నాణ్యత మెరుగవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. టీవీల ధరకు కూడా గణనీయంగా తగ్గనున్నాయి.
ప్రస్తుతం 32 అంగుళాల కంటే పెద్ద టీవీలు 28 శాతం GST శ్లాబులో ఉండగా.. త్వరలో 18 శాతం శ్లాబులోకి మారనున్నాయి. వివిధ ప్రపంచ బ్రాండ్ల పేరుతో టీవీలను ఉత్పత్తి చేసే SPPL CEO అవనీత్ సింగ్ మార్వా కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాలనికి 20 శాతం వృద్దిని సాధించవచ్చని అంచనా వేశారు. టీవీలపై GST భారీ తగ్గించడం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెప్పారు.
జూన్ త్రైమాసికంలో సవాళ్లు ఎదురైన నేపథ్యంలో ఈ ఉత్పత్తుల తయారీదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ముందస్తు రుతుపవనాలు, అకాల వర్షాల కారణంలో శీతలీకరణ ఉత్పత్తుల విక్రయాలను ప్రభావితం చేశాయి. దీంతో వోల్టాస్, బ్లూ స్టార్, హావెల్స్ వంటి సంస్థ తమ ఎయిర్ కండిషనింగ్ విభాగాల్లో 34 శాతం వరకు ఆదాయం తగ్గినట్లు తెలిపాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి తమ ప్రసంగంలో GST సంస్కరణలపై ప్రకటన చేశారు. దీపావళికి బహుమతి ఇస్తామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా 56 వ జీఎస్టీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 12 శాతం. 28 శాతం శ్లాబులను పూర్తి తీసివేశారు. 5 శాతం. 18 శాతం శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








