మొబైల్ యూజర్ల పై GST ఎఫెక్ట్.. పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ యూజర్ల పై ఎంతెంత?

జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రాబోతోన్న నేపథ్యంలో మొబైల్ బిల్లులు మోత మోగబోతున్నాయి. ప్రస్తుతం టెలికం సర్వీసులకు సంబంధించిన ట్యాక్స్ రేటు 15శాతంగా ఉంది. GST వల్ల 3 శాతానికి పెరిగి 18శాతంగా ఉంటుంది. ఈ ప్రభావం పోస్ట్-పెయిడ్ అలానే ప్రీ-పెయిడ్ మొబైల్ యూజర్ల పై పడుతుంది.

GST ఎఫెక్ట్.. పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ యూజర్ల పై ఎంతెంత?

ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానం ప్రకారం పోస్ట్ పెయిడ్ వినియోగం రూ.500గా ఉన్నట్లయితే ట్యాక్స్ మొత్తం కలుపుకుని రూ.575 చెల్లించాల్సి ఉంటుంది. రేపుటి నుంచి అమలు కాబోతోన్న కొతన్న పన్ను విధానంలో భాగంగా రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.15 ఎక్కువన్నమాట.

GST ఎఫెక్ట్.. పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ యూజర్ల పై ఎంతెంత?

ఇక ప్రీ-పెయిడ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి, ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానం ప్రకారం రూ.100 పెట్టి ప్రీపెయిడ్ వోచర్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.85 టాక్‌టైమ్ లభిస్తుంది. రేపుటి నుంచి అమలు కాబోతోన్న కొతన్న పన్ను విధానంలో భాగంగా రూ.100 పెట్టి ప్రీపెయిడ్ వోచర్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.82 టాక్‌ టైమ్ మాత్రమే లభిస్తుంది.

English summary
GST and mobile phone bills: Impact on post-paid and pre-paid users. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot