జీటాక్ సేవలను నిలిపివేసిన గూగుల్, రంగంలోకి హ్యాంగ్‌అవుట్స్
జీటాక్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీసులను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నిలిపివేసింది. 9 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రను కలిగిన జీటాక్ ను రీప్లేస్ చేస్తూ ఆ స్ధానంలో హ్యాంగ్‌అవుట్స్ ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

జీటాక్ రిటైర్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను మొట్ట మొదటిగా గూగుల్ ప్రోడక్డ్ మేనేజర్ (వాయిస్ ఇంకా హ్యాంగ్‌అవుట్స్) మయూర్ కామత్ ఫిబ్రవరి 16న ఓ బ్లాగ్ స్పాట్ ద్వారా ప్రకటించారు. జీటాక్ సర్వీస్ అధికారికంగా రద్దయినప్పటికి జిట్సీ, పీఎస్ఐ, ఇన్‌స్టెంట్ బర్డ్, మిరండా ఐఎమ్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే గూగుల్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు.

హ్యాంగ్‌అవుట్స్ గురించి క్లుప్తంగా: ఈ గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్‌లోని సభ్యల మధ్య వాయిస్ ఇంకా వీడియో కాల్స్ ఉచితం.

ఈ యాప్ ద్వారా 100 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను నిర్వహించుకోవచ్చు. ఈ యాప్‌లో అందుబాటులో ఉంచిన ఫోటోలు, మ్యాప్స్, ఇమోజీ, స్టిక్కర్స్, యానిమేటెడ్ గిఫ్స్ వంటి ఆప్షన్‌లను ద్వారా మీ మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుకోవచ్చు.
10 మంది సభ్యులతో ఉచిత గ్రూప్ వీడియో కాల్ నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలోని ఏ ఫోన్ నెంబరుకైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు (అవతలి వ్యక్తి ఖచ్చితంగా హ్యాంగ్‌అవుట్స్ వినియోగదారుడై ఉండాలి). జీటాక్ స్థానంలో హ్యాంగ్‌అవుట్స్‌ను పొందుపరుచుతున్నట్లు గూగుల్ జీటాక్ యాజర్లుకు ఓ ఈ-మెయిల్‌ను పంపింది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి


Click it and Unblock the Notifications








