దిమ్మతిరిగే షాక్: ఒక్క ఏడాదే 13 గూగుల్ ప్రొడక్ట్స్ షట్‌డౌన్

By Hazarath
|

గూగుల్... ఇప్పుడు సోషల్ మీడియాను ఊపుస్తున్న ఒకే ఒక పదం. ఇంటర్నెట్లో ఏది వెతకాలన్నా ముందుగా అందరూ చూసేది గూగుల్ వైపు...ఈ సెర్చ్ ఇంజిన్ లేకుండా ఇంటర్నెట్ ని ఊహించుకోవడం అసాధ్యం..అలాంటి గూగుల్ నుంచి ఎన్నో ప్రొడక్ట్ లు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి. అయితే దుమ్ము రేపే ప్రొడక్ట్ల సంగతి పక్కనబెడితే కొన్ని ప్రొడక్ట్ లు అడ్రస్ లేకుండా పోయాయి. వాటిని జనాలు లైక్ చేయకపోవడంతో వాటిని గూగుల్ షట్‌డౌన్ చేసింది. అవేంటో చూద్దాం.

Read more: గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ టీవీ (Google TV)

గూగుల్ టీవీ (Google TV)

2010లో అనౌన్స్ చేశారు. ఇది కంప్యూటరైజింగ్ టెలివిజన్ అంటూ భారీ ప్రచారంతో వచ్చింది. దీన్ని గూగుల్ టీవీ కన్నా ఆండ్రాయిడ్ టీవీగానే ఎక్కువ పాపులర్ చేసింది. ఏమైందో ఏమో దీన్ని జనవరి 6 2015న బంద్ చేస్తున్నట్లు తెలిపింది.

గూగుల్ కోడ్ (Google Code)

గూగుల్ కోడ్ (Google Code)

మార్చి 2005న అనౌన్స్ చేశారు. పదేళ్ల తరువాత జనవరి 25 2016న దీన్ని షట్ డౌన్ చేశారు.

గూగుల్ టాక్ (Google Talk)
 

గూగుల్ టాక్ (Google Talk)

ఆగష్టు 24 2005న దీన్ని మార్కెట్లోకి తెచ్చారు. అప్పట్లో ఇది బాగా పాపులర్ అయింది కూడా. కాని కొద్ది కాలానికి ఇది మూతపడింది. ఫిబ్రవరి 23న దీన్ని షట్ డౌన్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

క్లయింట్ లాగిన్ ఫ్రోటోకాల్ (ClientLogin protocol)

క్లయింట్ లాగిన్ ఫ్రోటోకాల్ (ClientLogin protocol)

ఇదొక మూడవ పార్టీ అప్లికేషన్. దీన్ని గూగుల్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏప్రిల్ 20 2015న మూతేసింది.

గూగుల్ హెల్స్ అవుట్స్ (Google Helpouts)

గూగుల్ హెల్స్ అవుట్స్ (Google Helpouts)

గూగుల్ దీన్ని నవంబర్ 2013న మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఇది కూడా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఏప్రిల్ 20న దీన్ని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్ ప్లస్ ఫోటోస్ (Google+ Photos)

గూగుల్ ప్లస్ ఫోటోస్ (Google+ Photos)

గూగుల్ లో మీరు సొంతంగా ఆల్బమ్ క్రియెట్ చేసుకోడానికి తెచ్చిన అప్లికేషన్ ఇది. అయితే దీన్ని అధికారికంగా ఆగస్టు 21 2015 నుంచి క్లోజ్ చేస్తున్నామని ప్రకటించింది.

పేజీ స్పీడ్ సర్వీస్ (PageSpeed Service)

పేజీ స్పీడ్ సర్వీస్ (PageSpeed Service)

ఈ ప్రొడక్ట్ ను జూలై 28 2015న లాంచ్ చేశారు. వెబ్ పేజీలు ఈ సర్వీస్ లో దాదాపు 25% to 60% స్పీడ్ అయ్యే విధంగా సెట్ చేశారు. అయితే దీనికి మరింతగా మెరుగులు దిద్దాలని ప్రకటించి దీన్ని ఆగస్టు 3 ,2015న షట్ డౌన్ చేశారు.

గూగుల్ క్యాటలాగ్స్ (Google Catalogs)

గూగుల్ క్యాటలాగ్స్ (Google Catalogs)

ఆగస్టు 4 2015న లాంచ్ చేశారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రెండింగ్ ప్రొడక్ట్ ల ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అయితే ఏమైందో ఏమో దీన్ని ఆగస్టు 4 2015 నుంచి షట్ డైన్ చేస్తున్నామని ప్రకటించారు.

ఆటోకంప్లీట్ ఎపీఐ (Autocomplete API)

ఆటోకంప్లీట్ ఎపీఐ (Autocomplete API)

ఇది టెక్ట్స్ కు సంబంధించిన యాప్. దీన్ని ఆగస్టు 10 2015న షట్ డౌన్ చేశారు.

గూగుల్ మోడరేటర్ (Google Moderator)

గూగుల్ మోడరేటర్ (Google Moderator)

సెప్టెంబర్ 24వ తేదీ దీన్ని లాంచ్ చేశారు. ఇదొక హెల్త్ ఫ్లాట్ పాం ఇంజనీర్. ఏమైందో ఏమోగాని ఆగస్టు 15, 2015న మోడరేటర్ లాస్ట్ డే అంటూ ప్రకటించేశారు.

గూగుల్ ఫ్లూ ట్రెండ్స్(Google Flu Trends)

గూగుల్ ఫ్లూ ట్రెండ్స్(Google Flu Trends)

ధీన్ని 2008లో అనౌన్స్ చేశారు. ఇదొక ట్రాక్ ఫ్లాట్ పాం. దీన్ని కూడా ఆగస్టు 20, 2015న క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

గూగుల్ హోటల్ ఫైండర్ (Google Hotel Finder)

గూగుల్ హోటల్ ఫైండర్ (Google Hotel Finder)

జూలై 28 2011న లాంచ్ చేశారు. హోటల్ కి సంబంధించిన సమస్త సమాచారం మీకు తెలిసే విధంగా రూపొందించారు. అయితే సెప్టెంబర్ 22, 2015న దీన్ని బంద్ చేస్తున్నట్లు షాక్ న్యూస్ చెప్పారు.

ఎడిటి ఫర్ ఎసిలిప్ (ADT for Eclipse)

ఎడిటి ఫర్ ఎసిలిప్ (ADT for Eclipse)

ఇదొక ఆండ్రాయిడ్ డెవలపర్.. అక్టోబర్ 2009న మార్కెట్లోకి వచ్చింది. అయితే అనుకోని కారణాలతో మూతపడిపోయింది. దీన్ని డిసెంబర్ 31, 2015న మూసివేస్తున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలిపింది.

Best Mobiles in India

English summary
Here Write Gtalk, Pagespeed, Flu Trends & 10 More Products Google Shut Down

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X