ఆన్‌లైన్‌లో 200 మంది చూస్తుండగానే ఆత్మహత్యకు యత్నించిన కుర్రోడు!

|

గ్యుల్ఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 200 మంది నెటిజనులు తిలకించటం సర్వత్రా చర్ఛనీయంశమైంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

 
200 మంది చూస్తుండగానే చచ్చేందుకు ట్రై చేసాడు!

స్టీఫెన్‌గా పరిచయం చేసుకున్న ఓ 20 సంవత్సరాల విద్యార్థి ‘‘నేను ఈ రాత్రికి ఆత్మహత్య చేసుకోబోతున్నాను, అందుకు అవసరమైనవన్ని సమకూర్చుకున్నాను, వాటిని ఖచ్చితంగా అమలు చేయబోతున్నాను అంటూ 4చాన్ ( 4chan) అనే ఆన్‌లైన్ ఫోరమ్‌లో తన భావోద్వేగాన్ని పోస్ట్ చేసాడు. ‘‘మిత్రులరా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, నా ఆత్మహత్య ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటున్నాను. నా ఆత్మహత్యను ప్రత్యక ప్రసారం చేసేందుకు ఏమైనా వెబ్‌సైట్‌లుంటే, లింక్ అడ్రస్ నాకు పోస్ట్ చేయడంటూ'' మరొక వ్యాఖ్యను స్టీఫెన్ పోస్ట్ చేసాడు.

స్టీఫెన్ పోస్ట్‌కు స్పందించిన ఓ 4చాన్ యూజర్ వీడియో చాట్ రూమ్‌ను సెటప్ చేయటంతో స్టీఫెన్ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా కొన్ని మాత్రలను మింగిన స్టీఫెన్ ఆ తరువాత వోడ్కాను సేవించటం ప్రారంభించాడు. మరి కొద్ది సేపటికి తను నివశిస్తున్న రూమ్‌కు నిప్పుపెట్టి మంచం మీద దుప్పటి ముసుగులోకి దూరిపోయాడు. మెసెజ్ బోర్డ్‌లో ఉన్న ఇతర సభ్యలు స్టీఫెన్ నీ చర్యను ఆపుకోమంటూ సందేశాలు పోస్ట్ చేయటం ప్రారంభించారు.

అయితే, కొద్ది సేపటిలోనే అగ్నిమాపక సిబ్బంది స్టీఫెన్ గదికి చేరకుని అతడిని మంటల నుంచి రక్షించారు. స్వల్ప గాయాలతో బయటపడిన స్టీఫెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూనివర్శటీ యాజమాన్యం విజ్ఞప్తి మేరకు సంబంధిత వెబ్‌సైట్ ఆ లైవ్ స్ట్రీమింగ్ వీడియోను తొలగించింది. స్టీఫెన్ ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X