మార్కెట్లోకి షియోమి నకిలీ ఉత్పత్తులు... జాగ్రత్త సుమా...

|

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి వాటి స్మార్ట్‌ఫోన్లు మరియు వాటి గాడ్జెట్‌లను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు అధిక మొత్తంలో షియోమి యొక్క ఉత్పత్తులు నకిలీవి మార్కెట్లోకి వచ్చాయి అని షియోమి సంస్థ నవంబర్‌లో డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 నకిలీ ఉత్పత్తులను
 

ఢిల్లీలోని గఫర్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు దాడులు జరిపారు. ఈ ప్రాంతంలో నాలుగు దుకాణాల్లో సుమారు 2 వేలకు పైగా షియోమి సంస్థ పేరుకు చెందిన నకిలీ ఉత్పత్తులను కనుగొన్నారు. తరువాత ఆ దుకాణాల యజమానులను అరెస్టు చేశారు.షియోమి బ్రాండ్ యొక్క ఉత్పత్తులను వాటి యొక్క భాగస్వామి అవుట్ లెట్లు మరియు అధికారికి దుకాణాల నుండి కొనుగోలు చేయాలని కోరుతున్నది.

అన్‌లిమిటెడ్ కాలింగ్ మీద పరిమితిని తొలగించిన వోడాఫోన్

షియోమి

కొనుగోలు నిర్ణయాల గురించి వినియోగదారులందరు జాగ్రత్తగా ఉండాలని మరియు వాటి మీద ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. కాబట్టి మీరు ఏదైనా షియోమి గాడ్జెట్లను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే సంస్థ యొక్క సలహా ప్రకారం మీరు తప్పక తనిఖీ చేయవలసిన ఆరు విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

RS.15000 లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

 Mi పవర్ బ్యాంక్స్

--- Mi పవర్ బ్యాంక్స్ వంటి కొన్ని షియోమి ఉత్పత్తులు భద్రతా సంకేతాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా ఉత్పత్తి యొక్క ఐడెంటిటీని గుర్తించడానికి mi.com లో తనిఖీ చేయవచ్చు.

--- రిటైల్ బాక్స్ యొక్క ప్యాకేజింగ్ మరియు నాణ్యత చాలా భిన్నంగా ఉంటాయి. అసలు ప్యాకేజింగ్‌ను ధృవీకరించడానికి ఏదైనా మి హోమ్ లేదా మి స్టోర్‌ను సందర్శించాలని షియోమి సంస్థ కొనుగోలుదారులకు సూచిస్తున్నది.

థియేటర్ కంటే ఖరీదైన Samsung Wall TV రిలీజ్... ధర చాలా ఎక్కువ

లోగో
 

--- షియోమి ఉత్పత్తిపై అసలు Mi లోగో ఉందొ లేదో తనిఖీ చేయాలని కొనుగోలుదారులకు సూచిస్తున్నది. అలాగే దీనికి అధికారం ఉందో లేదో తెలుసుకోవాలని సిఫారసు చేస్తోంది. ప్యాకేజింగ్ యొక్క అసలు లోగోను mi.com లో చూడవచ్చు.

--- మి బ్యాండ్ వంటి అన్ని అధీకృత ఫిట్‌నెస్ ఉత్పత్తులు Mi ఫిట్ యాప్ కంపాటిబిలిటీను కలిగి ఉంటాయి. ఇతర స్మార్ట్ పరికరాల కోసం ప్రత్యేక యాప్ లు ఉన్నాయి.

బ్యాటరీలు

--- ఒరిజినల్ బ్యాటరీలు Li-Poly బ్యాటరీలు అని సూచించే సంకేతాన్ని కలిగి ఉంటాయి. అయితే లి-అయాన్ వంటి సంకేతాలు ఉంటె కనుక అవి షియోమి యొక్క ఉత్పత్తులు కావు అని అర్థం.

--- నకిలీ USB కేబుల్స్ మరియు ఇతర ఉత్పత్తులు చాలా సన్నగా ఉంటాయి. అవి సులభంగా విరిగిపోతాయి కూడా.

Most Read Articles
Best Mobiles in India

English summary
Guidelines To Follow Before Buying Xiaomi Gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X