లింక్ క్లిక్ చేయగానే రూ.60,000 గోవిందా

|

ఇండియా లో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు . సాంకేతికతను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు . ఈ సైబర్ మోసాలు అధికమవడంతో ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరపాలంటే చాలామంది ఆలోచనలో పడుతున్నారు. దాదాపు 24శాతం మంది భారతీయ వినియోగదారులు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడుతున్నారని ఒక రిపోర్ట్. వీటికి తోడు సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేయడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చెయ్యడం, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ చేయడంలాంటివి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరో మోసం బయట పడింది. గురుగ్రామ్‌లో ఓ వ్యక్తికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది ఏంటా మెసేజ్ అని ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేశాడు. ప్రొద్దున అయ్యేసరికి చూస్తే అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయం అయ్యాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే...

 

రూ.10,000 ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా...?

ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది....

ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది....

గురుగ్రామ్‌లో నివసించే హరీష్ చందర్ వృత్తి రీత్యా వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన ఫోన్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ పెండింగ్‌లో ఉంది అంటూ అందులో ఉంది.

 లింక్ క్లిక్ చేసాడు....

లింక్ క్లిక్ చేసాడు....

నిజంగానే ఐటీ డిపార్ట్‌మెంట్ పంపిన మెసేజ్ అనుకోని లింక్ క్లిక్ చేసాడు. లింక్ క్లిక్ చేయగానే ఒక యాప్ ఇన్‌స్టాల్ అయింది.ప్రొద్దున లేచి చూసే సరికి అకౌంట్ నుంచి రూ.60 వేలు మాయం అయ్యాయి

వెంటనే  పోలీసులను ఆశ్రయించాడు....

వెంటనే పోలీసులను ఆశ్రయించాడు....

ఒక్కసారిగా షాక్ అయిన హరీష్ చందర్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడానికి ఈ టిప్స్ ను పాటించండి...
 

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడానికి ఈ టిప్స్ ను పాటించండి...

లేటెస్ట్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌......

ఇంటర్నెట్‌ అంటేనే వైరస్ మాల్‌వేర్‌, స్పామ్‌, స్పైవేర్‌ అని పిలవబడే వైర్‌సలు కంప్యూటర్‌ను నాశనం చేయడమే కాక వ్యక్తిగత సమాచారాన్నీ దొంగిలిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌తోపాటు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయాలి

సింపుల్‌ పాస్‌వర్డ్స్‌ ఎప్పుడూ పెట్టుకోకూడదు......

సింపుల్‌ పాస్‌వర్డ్స్‌ ఎప్పుడూ పెట్టుకోకూడదు......

సింపుల్‌ పాస్‌వర్డ్స్‌ ఎప్పుడూ పెట్టుకోకూడదు. అప్పర్‌, లోయర్‌ కేస్‌లతోపాటు నెంబర్లు, సింబల్స్‌ జోడించడం సురక్షితం. ఒకటే పాస్‌వర్డ్‌ అన్నింటికీ ఉంచడం కాకుండా ప్రతిదానికీ విభిన్నంగా ఎంచుకోవాలి. పాస్‌వర్డ్స్‌ను సేవ్‌ చేయకపోవడం ఉత్తమం.

ఈ-మెయిల్స్‌ జోలికి వెళ్లొదు...

ఈ-మెయిల్స్‌ జోలికి వెళ్లొదు...

కాన్ఫిడెన్షియల్‌ సమాచారం అడిగే ఈ-మెయిల్స్‌ జోలికి అస్సలు వెళ్లొదు. పేమెంట్‌ కంపెనీలేవీ మీ వ్యక్తిగత చెల్లింపుల సమాచారం అడుగవు. మీకు నమ్మకం లేని ఈ-మెయిల్స్‌ను అసలు తెరవద్దు. ఫ్లాషీయుఆర్‌ఎల్స్‌, బటన్స్‌ క్లిక్‌ చేయకండి. ఇన్‌బాక్స్‌లోనే స్పామ్‌ ఫిల్టర్స్‌ పెట్టుకోవడం మంచిది.

ఫ్రీవై-ఫై వాడకపోవడం మంచిది...

ఫ్రీవై-ఫై వాడకపోవడం మంచిది...

ఉచిత వై-ఫై టర్మినల్స్‌ వాడకపోవడం మంచిది. అలాగే పబ్లిక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్స్‌తో పాస్‌వర్డ్స్‌ అప్‌డేట్‌ చేయొద్దు. బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసేప్పుడు ఒరిజినల్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌ను మాత్రమే వినియోగించండి.

నమ్మకమైన సోర్స్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌...

నమ్మకమైన సోర్స్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌...

ఆన్‌లైన్‌లో ఫ్రీగా వస్తున్నాయని కాకుండా, నమ్మకమైన సోర్స్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాడ్‌ బ్లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్పైవేర్‌ డిటెక్షన్‌ ప్రోగ్రామ్‌నూ రన్‌ చేయడం వల్ల ఆన్‌లైన్‌ మోసాల బారినపడకుండా కాపాడుకోవచ్చు.

ఒకే క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు వినియోగించడం వల్ల.....

ఒకే క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు వినియోగించడం వల్ల.....

ఆన్‌లైన్‌లో ఒకే క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు వినియోగించడం వల్ల నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ . ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసిన వెంటనే మీ బ్యాంక్‌, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మరియు మర్చంట్‌ సైట్ల నుంచి తప్పనిసరిగా లాగ్‌ఔట్‌ అవ్వాలి . మీ కంప్యూటర్‌ లేదా స్మార్ట్ స్మార్ట్ ఫోన్ లో బ్యాంకుల పిన్ లేదా పాస్‌వర్డ్స్‌ సేవ్‌ చేయకండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Gurugram man clicks on link in phone, loses Rs 60,000 after app is installed automatically.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X