భారత ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు, H1-B visaపై ట్రంప్ కఠిన నిర్ణయం !

Written By:

హెచ్‌1 బీ వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ మరోసారి షాక్‌ ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నారు. హెచ్‌1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక టాప్‌ ఫెడరల్ ఏజెన్సీ అధికారి చెప్పారు.ఈ రూల్స్ కనుక అమల్లోకి వస్తే అమెరికాలో పని చేస్తున్న ఇండియా ఉద్యోగులు స్వదేశానికి పయనం అవ్వక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. డాల‌ర్ డ్రీమ్ క‌ల‌ క‌ల‌గానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

LTE సపోర్ట్‌తో ఆపిల్ వాచీలు,భారీ ఆఫర్లతో వస్తున్న జియో,ఎయిర్‌టెల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్ 1 బీ వీసా జారీ విష‌యంలో..

స్థానికుల‌కే ఉద్యోగాలంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా జారీ విష‌యంలో అనేక ఆంక్ష‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఆంక్ష‌ల‌తో అమెరికాలో ఎక్కువ శాతం ఉన్న భార‌తీయులు స్వదేశానికి తిరిగివ‌స్తున్నారు.

ముగింపు పలికే దిశగా..

తాజాగా అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. త్వరలో దీనికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.

డెబ్బై వేల మందికి వ‌ర్క్ ప‌ర్మిట్ లు..

హెచ్ 1 బీ హోల్డ‌ర్లు జీవిత భాగ‌స్వాములు సుమారు డెబ్బై వేల మందికి వ‌ర్క్ ప‌ర్మిట్ లు ఉన్నాయి. వీటితో పాటు మాజీ అధ్య‌క్షుడు ఒబామా హ‌యాంలో భార‌తీయుల‌కు ల‌బ్ది చేకూరేలా హెచ్ 1 బీ వీసా ఆంక్ష‌ల్ని స‌డలించారు. ఇప్పుడు ఆ ఆంక్ష‌ల స‌డ‌లింపు ర‌ద్దు, వ‌ర్క్ ప‌ర్మింట్ లు ర‌ద్దు చేసేందుకు ట్రంప్ సిద్ధ‌మ‌య్యారు.

2015లో ఒబామా ప్రభుత్వం..

2015లో ఒబామా ప్రభుత్వం హెచ్4 డిపెండెంట్ భాగస్వాములను ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ అర్హత ఉంది. ఇప్పుడు వాటిని తొలగించే యోచనలో ఉన్నామని ఆమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఓ లేఖలో సెనేటర్ చుక్ గ్రాస్లేకు తెలిపారు.

వీసా జారీలో కఠిన నిబంధనలతో..

ఇప్పటికే వీసా జారీలో కఠిన నిబంధనలతో భారత ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేసిన టంప్‌ తాజా చర్య అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపనుందని నిపుణుల అంచనా.

దేశాల వారీ కోటాను ఎత్తేయాలని

కాగా దేశాల వారీ కోటాను ఎత్తేయాలని అమెరికన్ భారతీయులు ఆయా ప్రాంతాల్లోని శాసనకర్తల మద్దతు కోరుతూ ర్యాలీలు చేశారు. హెచ్‌1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని..

ముఖ్యంగా అర్కాన్సాస్‌, కెంటక్కీ, ఓరెగావ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దేశాల వారీ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అమెరికన్లకు, శాసనకర్తలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాలీ నిర్వహకులు తెలిపారు.

లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో..

ఎప్పుడో లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నిబంధనను పెట్టారని, ఈ కాలానికి ఇది ఏమాత్రం అనువైనది కాదని అభిప్రాయపడ్డారు. లిండన్‌ జాన్సన్‌ 1963 నుంచి 1969వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.

300మంది గ్రీన్‌కార్డుల కోసం..

కెంటక్కీ లోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ర్యాలీలో దాదాపు 300మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశాల వారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
H1-B visa alert: Indian IT professionals to face tough procedures, no work permit to spouses; details here more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot