Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
రూ.87 వేల కోట్ల ప్రాజెక్ట్ రూ.13 వేలకే, అమెరికాకు దిమ్మతిరిగింది
హ్యాకర్లు ఎక్కడైనా సరే మొబైల్ నంబర్లు, పాస్ పోర్టులు, అలాగే ఇతర వ్యక్తిగత వివరాలు వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడి హ్యాక్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఎన్నో జరిగాయి. అయితే ఈ హ్యాకర్ ఓ సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఏకంగా అమెరికాకు చెందిన మిలటరీ రహస్యాలను డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచాడు. అమెరికా మిలటరీ ప్రాజెక్ట్ రహస్యాలను అత్యంత తక్కువ ధరకే అమ్ముతానంటూ ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని కనిపెట్టిన అమెరికా నిఘా విభాగం ఒక్కసారిగా ఖంగుతిని దిద్దుబాటు చర్యలను చేపట్టింది.

అమెరికా అభివృద్ధి చేసిన ఓ సీక్రెట్ ప్రాజెక్టు ..
భారీ ఎత్తున నిధులను కేటాయించి అమెరికా అభివృద్ధి చేసిన ఓ సీక్రెట్ ప్రాజెక్టు హ్యాక్ నకు గురైంది. ఈనెల ఆరంభంలో రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్ స్టిక్ గ్రూప్ ఈ విషయాన్ని కనుగొంది.

రూ. 81 వేల కోట్లతో
దాదాపు రూ. 81 వేల కోట్లతో (11.8 బిలియన్ డాలర్లతో) అత్యాధునిక ది ఏక్యూ-9 రీపర్ డ్రోన్లను అమెరికా అభివృద్ధి చేసింది.

నెట్ గేర్ రూటర్ లోకి చొరబడిన హ్యాకర్లు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును, డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేసిన అమెరికా, క్రీచ్ ఎయిర్ బేస్ లో దాన్ని దాచింది. ఇందులోని నెట్ గేర్ రూటర్ లోకి చొరబడిన హ్యాకర్లు ప్రధాన కంప్యూటర్ నుంచి డ్రోన్ టెక్నాలజీని అపహరించాడు.

ఆన్ లైన్ లో 200 డాలర్లకు
రిమోట్ యాక్సెస్ విధానంలో అత్యంత కీలకమైన ఈ సమాచారం మొత్తాన్నీ సేకరించిన హ్యాకర్, దాన్ని ఆన్ లైన్ లో 200 డాలర్లకు (సుమారు రూ. 13 వేలు) అమ్మకానికి పెట్టాడు. 150 డాలర్లకే ఇస్తానని కూడా చెప్పాడు.

ఎయిర్ పోర్టు కీలక సమాచారం
తన వద్ద డ్రోన్ సాంకేతికత, ఎయిర్ పోర్టు కీలక సమాచారం, వాటిల్లోని లోపాలు, నిర్వహణా బుక్, మరమ్మతుల కోసం ఎవరు పని చేస్తున్నారు?అనే విషయాలను హ్యాకింగ్ చేసి అమ్మకానికి ఉంచారు.

న్యూ టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్ లు
అలాగే న్యూ టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్ లు ఎలావుంటాయి? తదితర వివరాలు తన వద్ద ఉన్నాయని నమ్మకాన్ని కలిగించేందుకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా జతచేశాడా హ్యాకర్. ఇక యూఎస్ ఫైటర్ ట్యాంక్ సిబ్బంది అనుసరించే వ్యూహాలు కూడా హ్యాకింగ్ కు గురైనట్టు తెలుస్తోంది.

రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్‌స్టిక్ గ్రూప్
ఈ హ్యాకింగ్ విషయాన్ని గుర్తించిన రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్‌స్టిక్ గ్రూప్, అతన్ని సంప్రదించింది. అయితే ఇతను వారికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. తాను కేవలం ఆనందం, మజా కోసమే హ్యాక్ చేశానని హ్యాకర్ రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్‌స్టిక్ గ్రూప్ సమాధానమిచ్చారు.

ఎంక్యూ-1 డ్రోన్ మెక్సికోపై వెళుతుంటే..
తనకు విమానాలు, నిఘా కెమెరాల్లోని దృశ్యాలను చూడటం ఇష్టమని చెప్పిన అతను, ఎంక్యూ-1 డ్రోన్ మెక్సికోపై వెళుతుంటే, అది రికార్డు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను లైవ్ లో చూసినట్టు చెప్పాడు.

యూఎస్ తయారు చేసిన డ్రోన్లలో
ఈ మొత్తం వ్యవహారంపై యూఎస్ భద్రతా సంస్థలు దర్యాఫ్తును ప్రారంభించాయి. కాగా, ఇప్పటివరకూ యూఎస్ తయారు చేసిన డ్రోన్లలో ఇదే అత్యంత అధునాతనమైనదని తెలుస్తోంది.

పెంటగాన్, నాసాలతో పాటు సీఐఏ తదితర సంస్థలూ ..
రిమోట్ సాయంతో వెళ్లి, స్వతంత్రంగా దాడి చేసే సత్తా ఉన్నవి. వీటిని పెంటగాన్, నాసాలతో పాటు సీఐఏ తదితర సంస్థలూ వినియోగిస్తున్నాయి. వీటి సమాచారం లీక్ కావడంతో ఇప్పుడు అమెరికా భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470