ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేసిన యువకుడు.. 8 నెలలు జైలు శిక్ష

By Prashanth
|
Hacker Jailed for infiltrating Facebook Servers


వెబ్‌సైట్‌లో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని తెలివితేటలతో హ్యాక్ చేసే వారే హ్యాకర్లు. ఐతే చాలా మంది హ్యాకర్లని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే ధ్రిల్లింగ్ కోసమని, మరికొంత మంది ఆ వెబ్‌సైట్‌ని లక్ష్యంగా చేసుకోని హ్యాక్ చేశామని సమాధానాలు ఇచ్చారు. ఇలా అనధికారకంగా ఓ వెబ్‌సైట్ నుండి సమాచారాన్ని దొంగిలించిన ఓ బ్రిటిష్ హ్యాకర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాల వయసు కలిగిన గ్లెన్ మ్యాన్ఘమ్ గతంలో యాహు కంపెనీ సెక్యూర్ ఏరియాలను హ్యాక్ చేయడంతో పాటు గత ఏప్రిల్‌లో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేయాలని చూస్తే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోని ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించారు. ఈ సందర్బంలో పోలీసులు ముందు లోంగిపోయిన గ్లెన్ ఫేస్‌బుక్ బాహ్య హార్డ్ డ్రైవ్ నుండి విలువైన సమాచారాన్ని చట్ట విరుద్దంగా డౌన్ లోడ్ చేశానని ఒప్పుకున్నాడు.

గత రెండు నెలలు నుండి గ్లెన్ హాక్ చేస్తున్న తరుణంలో హ్యాకర్స్ నుండి తప్పించుకునేందుకు గాను ఫేస్‌బుక్ తమయొక్క సమస్యలను పరిష్కరించమని క్రైం డిపార్ట్‌మెంట్‌కి విచారణ కొరకు సుమారు $ 200,000 ఖర్చు చేసింది. అంతేకాకుండా ఫేస్‌బుక్ సంస్దలో పని చేస్తున్న ఉద్యోగి మాదరి ఇంటర్నల్‌గా మెయిన్ సర్వర్స్‌తో తాను ఎలా అనుసంధానం అయ్యాను అనే అన్ని విషయాలను క్లుప్తంగా వివరించాడు. గ్లెన్ తన తల్లి దండ్రులతో కలిసి జీవిస్తూ తన ఇంట్లో ఉన్న పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఈ హ్యాకింగ్ చేశానని చివరకు చెప్పడంతో ఆశ్చర్య పోవడం ఎఫ్‌బిఐ వంతు అయింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X