హెల్త్‌కేర్ వెబ్‌సైట్ హ్యాక్, 68 లక్షల రికార్డులు మాయం

By Gizbot Bureau
|

సైబర్ నేరగాళ్లు గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా ప్రభుత్వ, బ్యాంకింగ్‌‌, ఫైనాన్స్‌‌, ముఖ్యమైన ఇన్‌‌ఫ్రా వసతుల కంపెనీల కంప్యూటర్లపై, నెట్‌‌వర్క్‌‌లపై దాడులు చేశారని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సిస్కో తెలిపింది. కొన్ని దాడుల్లో ఇండియాలోని పలు కంపెనీలకు ఐదు మిలియన్‌‌ డాలర్ల (దాదాపు రూ.35 కోట్లు) చొప్పున నష్టం జరిగిందని వెల్లడించింది.

హెల్త్‌కేర్ వెబ్‌సైట్ హ్యాక్, 68 లక్షల రికార్డులు మాయం

 

20.1శాతం దాడులు బ్యాంకింగ్‌‌ సెక్టర్‌‌ లక్ష్యంగా, 19.6 శాతం దాడులు ప్రభుత్వ నెట్‌‌వర్క్‌‌లు లక్ష్యంగా, 15.1 శాతం దాడులు మౌలిక వసతుల కంపెనీలు లక్ష్యంగా జరిగాయని కంపెనీ ఉన్నతాధికారి విశాఖ్‌‌ రామన్‌‌ చెప్పారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, హ్యాకర్ల ముప్పు తొలగడం లేదన్నారు.

 పాయింట్‌‌ ఆఫ్‌‌ సేల్స్‌‌ అటాక్స్‌ టెక్నాలజీ

పాయింట్‌‌ ఆఫ్‌‌ సేల్స్‌‌ అటాక్స్‌ టెక్నాలజీ

రక్షణ, ఐటీ, టెలికం, హెల్త్‌‌కేర్‌‌ రంగాలపైనా కన్నేశారని చెప్పారు. రిటైల్‌‌, హాస్పిటాలిటీ, ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌, ఈ-కామర్స్‌‌ రంగాల నెట్‌‌వర్కులపై దాడులకు పాయింట్‌‌ ఆఫ్‌‌ సేల్స్‌‌ అటాక్స్‌‌ వంటి టెక్నాలజీలను వాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ నెట్‌‌వర్క్‌‌లపై దాడులకు ర్యాన్సమ్‌‌వేర్‌‌లను ఉపయోగిస్తున్నారని రామన్‌‌ వివరించారు.

68 లక్షల రికార్డులను

68 లక్షల రికార్డులను

ఇదిలా ఉంటే ఇటీవల భారత్‌కు చెందిన హెల్త్ కేర్ వెబ్ సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు హెల్త్ కేర్ వెబ్ సైట్లోకి చొరబడి 68 లక్షల రికార్డులను దొంగిలించినట్టు యూఎస్ బేసిడ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ FireEye ఒక ప్రకటనలో వెల్లడించింది. హెల్త్ కేర్ సైటులో పొందుపరిచిన రోగులు, డాక్టర్ల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్టు గుర్తించింది. ఆ సైట్ పేరు చెప్పేందుకు సైబర్ సంస్థ నిరాకరించింది.

డార్క్ వెబ్
 

డార్క్ వెబ్

చైనాకు చెందిన సైబర్ క్రిమినల్స్ ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ వెబ్ పోర్టల్ డేటాను నేరుగా ఆన్‌లైన్‌ బ్లాక్ మార్కెట్ (డార్క్ వెబ్) ద్వారా అమ్మేస్తున్నట్టు ఫైర్‌ఐ పేర్కొంది. ఫిబ్రవరిలో fallensky519 అనే పేరుతో భారత ఆధారిత హెల్త్ కేర్ వెబ్ సైట్ నుంచి 68లక్షల రికార్డులను హ్యాకర్లు దొంగలించారు. అందులో రోగుల సమాచారం(PII)తో పాటు వైద్యుల సమాచారం, PII, క్రెడిన్షియల్స్ హ్యాక్ చేసినట్టు FireEye రిపోర్టును షేర్ చేసింది.

2వేల డాలర్ల వరకు సేల్

2వేల డాలర్ల వరకు సేల్

2018 అక్టోబర్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఫైర్ ఐ థ్రెట్ ఇంటెలిజెన్స్ హ్యాకర్ల ప్రతి మూవెంట్ గమనిస్తూ వస్తోంది. బహుళ హెల్త్ కేర్ అనుబంధ డేటాబేస్ మొత్తం బ్లాక్ మార్కెట్ ఫారమ్స్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించింది. చాలావరకు 2వేల డాలర్ల వరకు సేల్ చేస్తున్నట్టు తెలిపింది.

 సైబర్ నేరగాళ్ల ప్రమేయం

సైబర్ నేరగాళ్ల ప్రమేయం

చైనీస్-నెక్సస్ గ్రూపులతో పాటు రష్యా-నెక్సస్ APT28 గ్రూపు సహా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడంలో సైబర్ నేరగాళ్ల ప్రమేయం ఉన్నట్టు ఫైర్ ఐ ఇంటెలిజెన్స్ గమనించింది. అంతేకాదు.. బయోమెడికల్ పరికరాల వాడకం పెరిగేకొద్దీ విఘాతం కలిగించే లేదా విధ్వంసక సైబర్ దాడులే లక్ష్యంగా మారే అవకాశం ఉందని సైబర్ సంస్థ రిపోర్టు తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hackers attack Indian healthcare website, steal 68 lakh records

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X