మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

|

ఆన్‌లైన్ ద్వారా హ్యాకర్లు ప్రజలను మోసం చేయడం కొత్త కాదు. ఇప్పటికే చాలా చూసాము. హ్యాకర్లు ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ యొక్క వెబ్‌క్యామ్‌ల ద్వారా మనం ఏమి చేస్తున్నాము అన్న విషయాలను చూస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం ఏవైనా అసభ్యకర వీడియోలను చూస్తున్నపుడు వాటిని చిత్రీకరిస్తున్నారు.

ఆన్‌లైన్
 

ఆన్‌లైన్ మోసాలలో ఇప్పుడు కొత్తగా మరొక దానిని కనుగొన్నారు. ప్రజలు ఇంటిలో ఎవరు లేని సమయంలో తమను ఎవరు చూడటం లేదు అని భావించి చాలా మంది ఆన్ లైన్ లో కొన్ని సైట్లలో పోర్న్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ వారికీ తెలియని విషయం ఏమిటంటే హ్యాకర్లు తాము వాడుతున్న సిస్టం యొక్క వెబ్‌క్యామ్‌ల ద్వారా పోర్న్ చూసేటప్పుడు వాటిని రహస్యంగా చిత్రీకరిస్తున్నారని పాపం తెలియదు.

Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

వెబ్‌క్యామ్‌

వెబ్‌క్యామ్‌ల ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోను ఉపయోగించి హకర్లు ఇప్పుడు మిమ్మలిని హ్యాకర్లు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడుతున్నారు. మీరు పోర్న్ చూస్తున్న వీడియో ఫుటేజీని తమకు ఇష్టమైన వారికీ షేర్ చేస్తాము అంటూ బెదిరిస్తున్న ఫోన్ కాల్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. డబ్బును డిమాండ్ చేస్తూ వచ్చే ఈ లాంటి ఫోన్ కాల్స్ చాలావరకు ఉత్తుత్తి బెదిరింపులే కావడం గమనార్హం.

ఆపిల్ యొక్క డివైస్ లలో నకిలీ వాటిని గుర్తించడం ఎలా?

ప్రూఫ్‌పాయింట్‌

దీనిని నిరూపించడానికి ప్రూఫ్‌పాయింట్‌లోని భద్రతా నిపుణులు హానికరమైన ఒక సాఫ్ట్‌వేర్‌ను కనుగొన్నారు. ఇది బాధితులకు తెలియకుండానే వెబ్‌క్యామ్‌ల నుండి వీడియోను తీయడానికి హ్యాకర్లకు వీలు కల్పిస్తుంది. 'సైక్స్ బాట్' అని పిలువబడే ఈ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్ తో రన్ అవుతున్న కంప్యూటర్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది వినియోగదారుకు తెలియకుండానే కంప్యూటర్‌లోకి లోడ్ అవుతుంది.

చంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్న ఇస్రో

వెబ్‌సైట్
 

ఇది అవమానకరమైన వెబ్‌సైట్ ద్వారా లేదా వీడియో, మ్యూజిక్ ఫైల్ లేదా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఇన్‌స్టాల్ అవుతుంది. బాధితుడి తమ సిస్టంలో PsiXBot ఇన్‌స్టాల్ చేసిన తర్వాత టైటిల్‌లో నిర్దిష్ట అశ్లీలతకు సంబంధించిన కీవర్డ్‌తో వెబ్ పేజీని తెరవడానికి వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు ఇది ఆటొమ్యాటిక్ గా యాక్సిస్ అవుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ పిక్సెల్4 కెమెరా ఫీచర్లను పొందడం ఎలా?

కంప్యూటర్

ఇది కంప్యూటర్ యొక్క కెమెరా ద్వారా వినియోగదారుని చిత్రీకరించడం ప్రారంభించడానికి సాఫ్ట్‌వేర్‌ను ప్రేరేపిస్తుంది. 'సైక్స్ బాట్' చాలా సంవత్సరాలుగా ఉంది. కానీ దీని కొత్త మాడ్యూల్ లో హ్యాకర్లు వీడియోను తీయడానికి అనుమతించే ప్రూఫ్ పాయింట్ కనుగొన్నట్లు నిపుణుడు వెర్నర్ థాల్మీర్ జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ కు తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hackers Blackmail By Filming On People While They Watch Rated Videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X