మీ పాస్‌వర్డే మీ శత్రువు అంటున్న హ్యాకర్లు

By Gizbot Bureau
|

సైబర్ నేరగాళ్లు మళ్లీ విజృంభిస్తున్నారు. రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపాడు. కేబుల్‌ను మన సిస్టంకు గనుక కనెక్ట్ చేస్తే ఆటోమాటిక్‌గా కంప్యూటర్ లాగ్ ఆఫ్ అవ్వడంతో పాటు మన పాస్‌వర్డ్‌లను రికార్డ్ చేస్తుందని తెలపడంతో ఆపిల్ ఐఫోన్ యూజర్లు ఒక్కసారిగాషాక్ తిన్నారు.అయితే ఇప్పుడు మీ పాస్ వర్డ్ ని డీకోడ్ చేయగలరనే వార్త బయటకు వచ్చింది.

hackers can decode your password just from the sound of typing study

మీ అకౌంట్‌కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. . మీరు కీబోర్డుపై టైప్ చేసే ప్రతిది సైబర్ నేరగాళ్లకు ఈజీగా తెలిసిపోతుందని వారు అంటున్నారు. మీకు తెలియకుండానే మీ పాస్‌వర్డ్‌ను వారు ఈజీగా తెలుసుకుంటారట. ఇది వింటుంటే మీకు నాన్నకు ప్రేమతో సినిమా గుర్తుకు వస్తుంది కదా. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్.. విలన్ పాస్‌వర్డ్‌ను ఎలా గెస్ చేసి మొత్తం డబ్బును ఎలా ట్రాన్సఫర్ చేశారో చూసే ఉంటారు.

పాస్‌వర్డ్ సౌండ్ వింటే చాలు

పాస్‌వర్డ్ సౌండ్ వింటే చాలు

అయితే హ్యాకర్లు సీసీకెమెరాలు ప్రతిచోట పెట్టలేరు కాబట్టి ఇప్పుడు వారు కీలాగర్లను వాడుతుంటారు.ఒక ప్రొగ్రామ్ ద్వారా మాల్ వేర్ కోడ్‌ను జొప్పించి కీబోర్డుపై టైప్ చేసే ప్రతి పదాన్ని గెస్ చేయగలరు. మొబైల్, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఏదైనా సరే మీ కీబోర్డుపై టైపింగ్ చేసే పాస్‌వర్డ్ సౌండ్ వింటే చాలు. వెంటనే పసిగట్టేస్తారని ఓ కొత్త అధ్యయనం తెలిపింది. టెక్సస్‌లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తమ అధ్యయనంలో గుర్తించారు.

 sound waves ద్వారా

sound waves ద్వారా

శబ్ద తరంగాల (sound waves)ద్వారా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్‌తో విజయవంతంగా passwordను డికోడ్ చేయగలరని పేర్కొంది. మొబైల్లో ఓ మైక్రోఫోన్ ఆధారంగా పాస్ వర్డ్ సాండ్‌ను ఈజీగా గుర్తించగలరని రీసెర్చర్లు తమ పరీశోధనలో వెల్లడించారు. ఈ మెథడ్ ద్వారా యూజర్ల పాస్ వర్డ్ ఈజీగా crack చేయడమే కాదు.. సదరు వ్యక్తి ఈమెయిల్స్ లేదా మెస్‌జ్‌లు కూడా చూడవచ్చు. ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్‌పై టైప్ చేస్తున్న పదాలను హ్యాకర్లు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఏమి టైపింగ్ చేస్తున్నాడో కూడా శబ్ద తరంగాల ద్వారా గుర్తించగలరు.

ధ్వనించే ప్రదేశంలో కూడా ఈజీగా

ధ్వనించే ప్రదేశంలో కూడా ఈజీగా

ధ్వని తరంగాలను హ్యాకర్లకు చేరకుండా స్మార్ట్ ఫోన్ అడ్డుకోగలదు. నిజానికి ధ్వనించే ప్రదేశంలో కూడా ఈజీగా హ్యాకర్లు పాస్ వర్డ్ డెటెక్ట్ చేయగలరు.తాము హ్యాకింగ్ కు గురవుతున్నామనే విషయం కూడా సదరు వ్యక్తికి ఎలాంటి ఆధారం ఉండదని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ఆన్ లైన్ యూజర్లు టైప్ చేసే డివైజ్ దేనితో తయారుచేశారో ముందుకు తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా మెటల్ లేదా ప్లాస్టిక్ డివైజ్ నుంచి వచ్చే సౌండ్ ప్యాటరన్ ను హ్యాకర్లు అర్థం చేసుకోగలరని వారు అంటున్నారు.

Best Mobiles in India

English summary
hackers can decode your password just from the sound of typing study

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X