Home
News

ఓటీపీలు చెప్పకపోయినా.. మీ బ్యాంకు ఖాతా హ్యాక్‌.. అర్జెంటుగా ఈ టిప్స్ తెలుసుకోకపోతే డేంజర్..

Online banking scams: సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు కొట్టేయడానికి సరికొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్లకు మీ మనీ కాజేయడానికి మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీలు, ఏటీఎం పిన్‌లు కూడా అవసరం లేదు. ఇటీవల కాలంలో ఈ కేటుగాళ్లు మీకు బ్యాంకుల నుంచి వచ్చినట్లుగా నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీరు పొరపాటున ఆ లింకులపై క్లిక్ చేశారో అంతే సంగతులు, మీ ఖాతాలోని డబ్బు క్షణాల్లో మాయం అవుతుంది.

స్కామర్లు మీ వ్యక్తిగత వివరాలను, ముఖ్యంగా ఫోన్ నంబర్లను మీరు ఎక్కడెక్కడ షేర్ చేశారో అక్కడి నుంచి సేకరిస్తారు. ఆ డేటా ఉపయోగించి, మీరు రీసెంట్‌గా కొన్న వస్తువులకు సంబంధించిన నకిలీ మెసేజ్‌లు పంపిస్తారు. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువతి కొద్దిరోజుల క్రితం ఇలాంటి మోసంలో దాదాపు చిక్కుకుంది.

Hackers Can Know Your OTP to Access Bank Accounts  How to Stay Safe From online banking scams

ఆమెకు మీరు ఒక బహుమతి గెలుచుకున్నారని మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్‌లో ఉన్న ఒక చిన్న తప్పును ఆమె గమనించింది. అనుమానం రావడంతో ఆ మోసం నుంచి ఆమె తప్పించుకోగలిగింది. కానీ అందరికీ ఆమెలాంటి పరిశీలన ఓపిక తెలివి ఉండకపోవచ్చు.

* సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..

ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అది ఎంత నమ్మకంగా అనిపించినా తొందరపడొద్దు. డిస్కౌంట్లు, వోచర్లు, క్యాష్ రివార్డులు అంటూ ఆఫర్లు ఇచ్చే లింకులపై అస్సలు క్లిక్ చేయవద్దు.

అవి మిమ్మల్ని ట్రాప్ చేయడానికే అని గుర్తుంచుకోవాలి. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు నమ్మకమైన ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ వంటి వాటి నుంచే చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ దొరికే యాప్స్ అస్సలు వద్దు. ఎందుకంటే ఆ యాప్‌లు మీ ఫోన్ కెమెరా, ఫొటో గ్యాలరీ వంటి వాటికి యాక్సెస్ తీసుకుంటాయి.

వాటితో స్కామర్లు కేవైసీ మోసాలు చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానాస్పదమైన ఫోన్ కాల్ వస్తే, వెంటనే స్పందించవద్దు. ముందు ఆ విషయాన్ని అధికారిక మార్గాల ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే వస్తే అధికారులకు ఫోన్ చేయాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండగలరు.

* హ్యాకర్లు వాడే మోసాలు ఇవే..

- కాల్ మెర్జింగ్ స్కామ్

ఈ ట్రిక్‌లో స్కామర్ మీకు ఫోన్ చేస్తాడు. తెలిసిన వ్యక్తిలా మాట్లాడుతూ ఏదో ఒక ఈవెంట్ కవర్ చేయమని అడుగుతాడు. మీరు మాట్లాడుతుండగానే మరో నంబర్ నుంచి మీకు కాల్ వస్తుంది. అప్పుడు స్కామర్ రెండో కాల్ ఏదో వీఐపీ నుంచి అని నమ్మించి, రెండు కాల్స్‌ను మెర్జ్ చేయమని అడుగుతాడు.

మీరు మెర్జ్ చేయగానే, హ్యాకర్ మీ మాటలు వింటూ ఉంటాడు. మీరు బ్యాంకు నుంచి గానీ, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి యాప్‌ల నుంచి గానీ వచ్చే ఓటీపీలను చెప్పేస్తే అవి వాళ్లకు తెలిసిపోతాయి. అంతే, మీ అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బు కొట్టేస్తారు. మీ ఫ్రెండ్‌కి ఫ్రెండ్‌ని అని కూడా చెప్తారు జాగ్రత్త.

- APK, RAT మాల్వేర్ స్కామ్

హ్యాకర్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (APK) ఫైల్స్‌లో, రిమోట్ యాక్సెస్ ట్రోజన్‌లు (RATs)లో మాల్వేర్‌ను దాచిపెడతారు. ఈ మాల్వేర్‌తో స్కామర్లు మీ ఫోన్‌ను మీకు తెలియకుండానే కంట్రోల్ చేయగలరు. ఉదాహరణకు, గతేడాది మే 21న హసన్ సబ్-డివిజన్‌కు చెందిన ఒక డీఎస్పీ ఏకంగా రూ.15.98 లక్షలు పోగొట్టుకున్నారు.

ఆయన ఒక నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి వచ్చినట్లుగా ఉన్న మెసేజ్‌లోని లింక్ ద్వారా ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఆ లింక్‌లో మాల్వేర్ ఉండటంతో, హ్యాకర్లు ఆయన ఫోన్‌లోకి ఈజీగా ఎంటర్ అయిపోయారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Hackers steal money via fake messages, malware, call merging, bypassing OTPs. Avoid suspicious links, verify calls, use trusted apps, protect personal and bank details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X