ఆకాశ యంత్రం పై ‘హై అలర్ట్’!

Posted By: Staff

ఆకాశ యంత్రం పై ‘హై అలర్ట్’!

లండన్: అంగారక గ్రహంపైకి నాసా(Nasa) పంపిన క్యూరియాసిటీ రోవర్‌కు కరుడుగట్టిన హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజ్ అరెస్టుకు నిరసనగా అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన ‘అనానిమస్’ అనే హ్యాకర్ల బృందమే రోవర్ హ్యాకిం‌గ్‌కూ పాల్పడవచ్చని హెచ్చరించింది.

అంగారకుడి పై విజయవంతంగా అడుగపెట్టిన క్యూరియాసిటీ రోవర్ తన పరిసర ప్రాంతాలకు సంబంధించిన అనేక ఫోటోలను నాసా (NASA)కు పంపింది. కారు పరిమాణంలో ఉండే ఈ సాంకేతిక యంత్రం తాజాగా తనకు ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని కెమెరాలలో బంధించింది. ఈ ప్రాంతానికి సంబంధించి క్యూరియాసిటీ రోవర్ పంపిన 130 చిత్రాలు పర్వాతాలు, పొగ మంచుతో కూడికుని ఉన్న పర్యావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ ప్రాంతం అమెరికాలోని మొజావే ఎడారిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting