Home
News

వణికిస్తోన్న క్రిప్టోకరెన్సీ మైనింగ్, హ్యాకర్ల టార్గెట్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లే

ప్రభుత్వ వెబ్‌సైట్‌లు మరోసారి హ్యాకర్ల వలలో చిక్కుకున్నాయి. రాష్ట్రస్థాయి వెబ్‌సైట్‌ల దగ్గర నుంచి మున్సిపర్ కార్పొరేషన్ స్థాయి వెబ్‌సైట్స్ వరకు క్రిప్టో జాకింగ్ వలలో చిక్కుకున్నాయి.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లు మరోసారి హ్యాకర్ల వలలో చిక్కుకున్నాయి. రాష్ట్రస్థాయి వెబ్‌సైట్‌ల దగ్గర నుంచి మున్సిపర్ కార్పొరేషన్ స్థాయి వెబ్‌సైట్స్ వరకు క్రిప్టో జాకింగ్ వలలో చిక్కుకున్నాయి. ఎకనిమిక్ టైమ్స్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం క్రిప్టో-జాకింగ్ మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇతరులు కంప్యూటింగ్ పవర్‌ను దొంగిలించి బిట్ కాయిన్‌లను ఎర్న్ చేసే క్రమంలో క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్వేర్‌ను హ్యాకర్లు వ్యాప్తి చేస్తున్నారు.

హ్యాకర్ల ఉచ్చులో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు..

హ్యాకర్ల ఉచ్చులో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు..

తాజాగా ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలను టార్గెట్ చేసిన హ్యాకర్లు తిరుపతి మున్సిపల్ కార్పారేషన్ అలానే మాచెర్ల మున్సిపాలిటీలకు చెందిన వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసారు. సాధారణంగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు దేశపౌరుల నుంచి ట్రాఫిక్ ఎక్కువుగా వస్తుంటుంది. వీరు ఈ వెబ్‌సైట్‌లలో వివిధ రకాల సమాచారాల కోసం సెర్చ్ చేస్తుంటారు. సరిగ్గా ఇటువంటి వెబ్‌సైట్‌లనే టార్గెట్ చేసిన యూజర్లు వీటిలో మైనింగ్ కోడ్‌ను లోడ్ చేయగలిగే హానికర స్క్రిప్ట్ ను ఇన్‌స్టాల్ చేయగలిగారు.

 

 

విజిటర్స్ తాలూకా కంప్యూటర్స్‌లోకి ప్రవేశించి..

విజిటర్స్ తాలూకా కంప్యూటర్స్‌లోకి ప్రవేశించి..

ఈ స్క్రిప్ట్ తో లోడై ఉన్న వెబ్‌సైట్లు తమ సైట్‌లను సందర్శించే విజిటర్స్ తాలూకా కంప్యూటర్స్‌లోకి మైనింగ్ కోడ్‌ను లోడ్ చేసి వారికి సంబంధించిన ఎలక్ట్రసిటీ అలానే ఇంటర్నెట్ కనెక్షన్‌లను క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం పనిచేసాలా మార్చేస్తాయి. ఈ మాల్వేర్‌ను తొలత గౌహతి బేసిడ్ సెక్యూరిటీ రిసెర్చర్స్ అయిన షాకిల్ అహ్మద్, అనీష్ శర్మ, ఇంద్రజీత్ భుయాన్‌లు గుర్తించారు. మోస్ట్ విజిటెడ్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన సబ్ డొమైన్‌లనే హ్యాకర్లు ఎక్కువుగా టార్గెట్ చేసినట్లు వీరు తెలిపారు.

 

 

మైనింగ్ యథేచ్చగా జరుగుతోంది...

మైనింగ్ యథేచ్చగా జరుగుతోంది...

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దాడిని ధృవీకరించినప్పటికి నిన్నటి వరకు కూడా ఆయా ఎఫెక్టెడ్ వెబై‌సైట్‌లలో క్రిప్టోకరెన్సీ మైనింగ్ అనేది యాక్టివ్‌గానే జరుగుతూ ఉందని రిసెర్చర్లు తెలిపారు. ఈ స్ర్కిప్ట్‌లను లోడ్ చేయటం ద్వారా హ్యాకర్లు ఎంత మొత్తంలో క్రిప్టోకరెన్సీని మైన్ చేయగలిగారు అనే దాని పై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. వెబ్‌సైట్‌లలో లోడ్ చేసిన కాయిన్‌హైవ్‌ స్క్రిప్ట్ ను అనామక కరెన్సీ అయిన మోనిరో కోసం బిల్ట్ చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

 

 

ఓ ప్రత్యేకమైన కోడ్ ఆధారంగా రన్ అవుతాయి..

ఓ ప్రత్యేకమైన కోడ్ ఆధారంగా రన్ అవుతాయి..

కాయిన్ హైవ్‌స్ర్కీప్ట్ అదేవిధంగా దాని తరహాలో డిజైన్ చేయబడిన క్రిప్టో జాకింగ్ స్కీమ్స్ ఓ ప్రత్యేకమైన కోడ్ ఆధారంగా రన్ అవుతాయట.ఈ కోడ్ విజటర్స్ కంప్యూటింగ్ పవర్‌ను ఉపయోగించుకుని క్రిప్టోకరెన్సీని మైన్ చేస్తుందట. యూజర్ కంప్యూటర్‌లో కాయిన్‌హైవ్‌ స్ర్కీప్ట్ రన్ అవ్వటం మొదలైన తరువాత కరెంటు బిల్లులతో పాటు ఇంటర్నెట్ బిల్లలు విపరీతంగా జనరేట్ అయిపోతుంటాయట.

 

 

Best Mobiles in India

English summary
Hackers have been running cryptocurrency mining malware on government websites.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X