అమ్మకానికి 27కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా..?

By Gizbot Bureau
|

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో యూజర్ల డేటా భద్రమేనా? అనే ప్రశ్న చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది హ్యాకర్లు దాదాపు 27కోట్లమంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దొంగిలించి, డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారట. ఈ విషయాన్ని సింగపూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబల్ వెల్లడించింది. మొత్తమ్మీద 26.7కోట్లమంది యూజర్ల డేటాను 500 యూరోలకు(సుమారు రూ.41,500) అమ్మేశారట. ఈ డేటాను తామే కొనుగోలు చేసిన సైబల్ పరిశోధకులు.. దీనిలో అకౌంట్ల పాస్‌‌వర్డులు లేవని, కానీ పేర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, మెయిల్ అడ్రస్‌లు, పుట్టినతేదీలు, ఫోన్ నంబర్లు తదితర వివరాలున్నాయని తెలిపారు.

87 మిలియ‌న్ల మంది యూజ‌ర్ల డేటా

87 మిలియ‌న్ల మంది యూజ‌ర్ల డేటా

గ‌తంలో యూకేకు చెందిన పొలిటిక‌ల్ క‌న్స‌ల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జి అన‌లిటికా ఫేస్‌బుక్‌లోని 87 మిలియ‌న్ల మంది యూజ‌ర్ల డేటాను త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోగా.. ఈ విష‌యం అప్ప‌ట్లో దుమారం రేపింది. దీంతో ఫేస్‌బుక్‌పై ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ ఏకంగా 5 బిలియన్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది. అయితే ఆ సంఘ‌ట‌న ఇంకా మ‌రిచిపోక‌ముందే ఫేస్‌బుక్ అలాంటిదే మ‌రో ఘటన రావడంతో కొత్త స‌మ‌స్య‌లో ఇరుక్కుంది.

26.7 కోట్ల మంది యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని

26.7 కోట్ల మంది యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని

ఫేస్‌బుక్‌లోని 26.7 కోట్ల మంది యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ప‌లువురు హ్యాక‌ర్లు చోరీ చేసి దాన్ని డార్క్ వెబ్‌లో కేవ‌లం 500 యూరోల‌కే (దాదాపుగా రూ.41వేలు) అమ్ముకున్నార‌ని ప్ర‌ముఖ సైబ‌ర్ రిస్క్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫాం సైబిల్ వెల్ల‌డించింది. తాము ఆ స‌మాచారాన్ని డౌన్‌లోడ్ చేసి వెరిఫై చేశామ‌ని సైబిల్ తెలిపింది. అయితే యూజ‌ర్ల‌కు చెందిన ఈ-మెయిల్ అడ్ర‌స్‌లు, ఫేస్‌బుక్ ఐడీలు, పుట్టిన తేదీ, ఫోన్ నంబ‌ర్ల‌ను మాత్రమే హ్యాక‌ర్లు చోరీ చేశార‌ని.. వారి అకౌంట్ల‌కు చెందిన పాస్‌వ‌ర్డ్‌లు చోరీకి గురి కాలేద‌ని సైబిల్ తెలియ‌జేసింది.

డార్క్ వెబ్‌లో

డార్క్ వెబ్‌లో

ఇకఫేస్‌బుక్‌లో చోరీ కాబడిన స‌ద‌రు యూజ‌ర్ల స‌మాచారం ఇప్ప‌టికే డార్క్ వెబ్‌లో ఎంతో మంది చేతులు మారింద‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యంపై ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు స్పందిస్తూ.. తాము ఈ సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, యూజ‌ర్ల స‌మాచారాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు తాము నిరంత‌రం కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. 

జూమ్ అనే యాప్‌

జూమ్ అనే యాప్‌

అయితే ఫేస్‌బుక్ ఒక్క‌టే కాదు.. తాజాగా ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్న జూమ్ అనే యాప్‌కు చెందిన దాదాపు 5 ల‌క్ష‌ల లాగిన్ క్రెడెన్షియ‌ల్స్‌ను కూడా కొంద‌రు హ్యాక‌ర్లు చోరీ చేశార‌ని ఇప్ప‌టికే సైబిల్ తెలిపింది. అయితే తాజాగా ఫేస్‌బుక్‌లో జ‌రిగిన డేటా చౌర్యం దృష్ట్యా యూజ‌ర్లు త‌మ సెక్యూరిటీ, ప్రైవ‌సీ సెట్టింగ్‌ల‌ను మార్చుకోవాల‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.  

Best Mobiles in India

English summary
Hackers sell data of 26.7 crore Facebook users for Rs 41,500

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X