13 వసంతాలు పూర్తిచేసకున్న వికీపీడియా

Posted By:

హ్యాపీ బర్త్ డే ‘వికీపీడియా’

వికీపీడియా... నెటిజనులకు ఇదో విజ్ఞాన బాండాగారం. అనేకమైన అంశాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వికీపీడియాలో లభ్యమవతుంది. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే ఈ వికీపీడియా వ్యవస్థను నెటిజనులందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, ఆయా విషయాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు జత చేయవచ్చు కూడా. అందుకే వికీపీడియా స్వేచ్చా విజ్ఞాన సర్వస్వంగా చరిత్రపుటల్లో నిలిచింది. వివిధ అంశాలకు సంబంధించిన డేటా వివిధ భాషల్లో ఇక్కడ లభ్యమవుతుంది. ఈ టాపిక్‌లను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. అంతర్జాలంలో వికీపీడియాకు గొప్స స్థానం ఉంది.

వికీపీడియాను ఎప్పుడు ప్రారంభించారు..?

స్వేచ్చా విజ్ఞాన సర్వస్వంగా పేరొందిన వికీపీడియాను 2001వ సంవత్సరం జనవరి 15వ తేదీన జిమ్మీ వేల్స్. లానీ సాంగర్ అనే ఇద్దురు సాంకేతిక నిపుణులు ప్రారంభించటం జరిగింది. కొద్దికాలంలోనే అనేక భాషల్లోకి వికీపీడియా విస్తరించింది. తెలుగు వికీపీడియాను 2003లో ప్రారంభించారు. అయితే, ఆరంభ సమయంలో రెండు సంవత్సరాల పాటు పలు సమస్యలను ఎదుర్కొన్న వికీపీడియా కొంతమంది బ్లాగర్ల కృషితో 2005వ సంవత్సరంలో ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకుంది. డిసెంబర్ 7, 2013 వరకు సేకరించిన గణాంకాల మేరకు తెలుగు వికీలో 53,932 వ్యాసాలు ఉన్నాయి.

13 వసంతాలు పూర్తి చేసుకున్న వికీపీడియా

జనవరి 15, 2001న ప్రారంభించబడిన వికీపీడియా జనవరి 15, 2014తో 13 వసంతాలను పూర్తిచేసుకుంది. నెటిజనులు వికీపీడియాను  మరింతంగా ఆదరించాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య మరింత పెరగాల్సి ఉంది. ఇందుకు తెలుగు ఇంటర్నెట్ ప్రియుల కృషి ఎంతో కీలకం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot