తిరుగులేని తెలుగు తేజం.. నేడు సత్య నాదెళ్ల 49వ పుట్టిన రోజు

మైక్రోసాఫ్ట్ సీఈఓగా విధులు నిర్వహిస్తోన్న మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నేడు (ఆగష్టు 19) తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల వివిధ విభాగాల్లో పనిచేస్తూ వచ్చారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి 39 సంవత్సరాల చరిత్ర ఉంది.

తిరుగులేని తెలుగు తేజం.. నేడు సత్య నాదెళ్ల 49వ పుట్టిన రోజు

Read More : 10 బెస్ట్ Asus స్మార్ట్‌ఫోన్‌లు

కంపెనీ మొదటి సీఈఓగా బిల్ గేట్స్ వ్యవహిరించారు. రెండువ సీఈఓగా స్టీవ్ బాల్మర్ విధులు నిర్వహించారు. మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోన్న సత్యనాదెళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైదరాబాద్‌లో జన్మించారు

సత్యనాదెళ్ల ఆగస్టు 19, 1967లో హైదరాబాద్‌లో జన్మించారు. సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం.

మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్

హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన సత్య నాదెళ్ల మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

మైక్రోసాఫ్ట్ ప్రస్థానం

సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ విండస్ డెవలప్‌మెంట్ విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసారు. 1999లో మైక్రోసాఫ్ట్ బీసెంట్రల్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా, 2001లో మైక్రోసాఫ్ట్ బిజెనెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2007లో ఆన్‌లైన్ సేవల విభాగానికి సీనియర్ ఉప్యాధ్యక్షుడిగా, 2011లో మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 2014లో ఏకంగా కంపెనీ సీఈఓ బాధ్యతలను స్వీకరించి ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం

సత్య నాదెళ్లకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడటమే నాకు అన్నీ నేర్పిందని చెబుతుంటారు సత్య. పాఠశాల జట్టులో అతను ఆడుతూ వచ్చాడు. జట్టుతో కలిసి పనిచేయడం క్రికెట్ ఆడడం వల్ల నేర్చుకున్నానని, జీవితమంతా తనకు నాయకత్వం ఉందని సత్య నాదెల్ల అన్నారు.

పుస్తకాలు చదవడం..

పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం.

ఎంబీఏ కూడా పూర్తి చేసారు

సాంకేతిక విభాగంలో ఉన్నత చదువులు చదివిన సత్య నాదెళ్ల  ఎంబీఏ కూడా పూర్తి చేయటం విశేషం. మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా తన భవిష్యత్ ను తీర్చిదిద్దుకున్న సత్య నాదెళ్లను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి.

వివాహం, సంతానం

సత్య నాదెళ్ల తన హైస్కూల్ స్నేహితురాలు అనుపమను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్‌లో స్థిర నివాసం

క్లౌడ్ కంప్యూటింగ్ పై పూర్తి పట్టు

మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్‌ప్రైస్ బిజినెస్‌ను అభివృద్థి చేయటంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. భవిష్యత్త్  టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై సత్య నాదెళ్లకు పూర్తి పట్టుంది.

ఏకాగ్రత మొత్తం మైక్రోసాఫ్ట్ పైనే

సత్య నాదెళ్ల ఏకాగ్రత మొత్తం మైక్రోసాఫ్ట్ అభివృద్థి పైనే. సత్య నాదెళ్ల ప్రస్తుతం 'హిట్ రిఫ్రెష్' అనే పుస్తకం రాస్తున్నారు. ఈ పుస్తకంలో అనేక ఆసక్తికర అంశాలను నాదెళ్ల ప్రస్తావించనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Happy Birthday Satya Nadella: interesting facts about Microsoft CEO. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot