హ్యాపీ భర్తడే: 20 సంవత్సరాల వరల్డ్ వైడ్ వెబ్

Posted By: Staff

హ్యాపీ భర్తడే: 20 సంవత్సరాల వరల్డ్ వైడ్ వెబ్

న్యూఢిల్లీ : వరల్డ్‌వైడ్‌వెబ్ ఇరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా నెటిజన్లంతా ‘ఆగస్టు 6’ను అత్యంత ఆనందోత్సాహాలతో స్మరించుకున్నారు. ఇరవయ్యేళ్ల క్రితం 1991, ఆగస్టు 6న మొట్టమొదటి వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వరల్డ్‌వైడ్ వెబ్‌ను కనుగొన్న టిమ్ బర్నర్స్ లీ తన ప్రాజెక్టు గురించి తొలి వెబ్ సైట్ www.w3.org.లో వివరించాడు. ఈ వెబ్‌సైట్ ఇపుడు info.cern.ch. గా కనిపిస్తుంది. మొట్టమొదటి వెబ్‌సర్వర్ అదే. అయితే 1992 నాటికల్లా 50 వెబ్‌సర్వర్లు పుట్టాయి. ఇపుడు వీటి సంఖ్య కోట్లలో ఉంటుంది. వరల్డ్‌వైడ్ వెబ్‌సైజ్ డాట్‌కామ్ లెక్క ప్రకారం 2011 ఆగస్టు 5 నాటికి వెబ్‌లో 1968కోట్ల పేజీలున్నాయి. ప్రపంచజనాభా కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ.

తొలుత సెర్న్ ఫిజిక్స్ లేబొరేటరీకి చెందిన భౌతికశాస్త్రవేత్తలు తమ డేటాను ఒకరినొకరు పంచుకోవడం కోసమే వెబ్‌ను ఉపయోగించేవారు. 1991 ఆగస్టు 6న సాధారణ జనానికి కూడా వెబ్ అందుబాటులోకి వచ్చింది. అయితే వెబ్ ప్రారంభమైన తర్వాత తొలి రెండేళ్లూ రకరకాల బ్రౌజర్ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. 1992లో మొట్టమొదటగా ఓ ఫోటోను నెట్‌లో అప్‌లోడ్ చేశారు. 93 చివర్లో విండోస్, మ్యాక్ ఓఎస్‌లకు ఆ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. తొలి వెబ్ బ్రౌజర్ నెట్‌స్కేప్ నావిగేటర్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting