Home
News

వావ్..జియో హ్యాపీ అవర్స్ వచ్చేస్తున్నాయి

దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మార్కెట్లోకి సరికొత్తగాదూసుకొస్తోంది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మార్కెట్లోకి సరికొత్తగాదూసుకొస్తోంది. టెలికాం మార్కెట్లో సత్తా చాటిన విధంగానే బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే రిలయన్స్‌ జియో హ్యాపీ అవర్స్‌ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కేబుల్‌ ఆపరేటర్స్‌ ఛార్జ్‌ చేసే దానికంటే సగం తక్కువగా ఇంటర్నెట్‌ ఆధారిత టెలివిజన్‌ ప్రొగ్రామింగ్‌ సర్వీసులను(జియోగిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను) ఆఫర్‌ చేసేందుకు ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. వీటి ప్రారంభ ధర 500 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

దిపావళి కంటే ముందస్తుగానే..

దిపావళి కంటే ముందస్తుగానే..

ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో, అక్కడ తొలుత ఈ సర్వీసులను అందజేయనున్నారు. జియోగిగాఫైబర్‌ను దిపావళి కంటే ముందస్తుగానే కమర్షియల్‌గా ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది.

ఆగస్టు 15 నుంచే..

ఆగస్టు 15 నుంచే..

ఈ సర్వీసుల అందుబాటు ఆగస్టు 15 నుంచే ప్రారంభమయ్యే వినియోగదారుల రిజిస్ట్రేషన్లను బట్టి ఉంటుందిని జియో నుంచి అనధికార సమాచారం

తొలుత మెట్రో నగరాల్లో..

తొలుత మెట్రో నగరాల్లో..

తొలుత మెట్రో నగరాల్లో, ఆ అనంతరం 80 టాప్‌ టైర్‌ 1, టైర్‌ 2 మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్యాక్స్‌ను కేబుల్‌ ఆపరేటర్స్‌ ఆఫర్‌ చేస్తున్నారు.

రూ.700 నుంచి రూ.1000 మధ్యలో..

రూ.700 నుంచి రూ.1000 మధ్యలో..

నెలకు రూ.700 నుంచి రూ.1000 మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్‌ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు.

100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో..

100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో..

జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది.

25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌

25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌

కంపెనీ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్‌ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఒక్క​ జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే..

ఒక్క​ జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే..

అంటే ఒక్క​ జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే లభ్యం కానుందని హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్‌, టెలికాం విశ్లేషకులు రాజీవ్‌ శర్మ చెప్పారు.

జియో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌

జియో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌

టీవీ సర్వీసులతో వస్తున్న జియో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, తన సొంత 4జీ మొబైల్‌ డేటా వ్యాపారాలను దెబ్బకొట్టవని విశ్లేషకులు చెప్పారు.

4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే ఎక్కువ ..

4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే ఎక్కువ ..

ఫైబర్‌ ఆధారిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల వీడియో స్ట్రీమింగ్‌ నాణ్యత, 4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కంటే ఎక్కువ విశ్వసనీయతతో, స్థిరంగా ఉంటాయని ఫిలిప్‌క్యాపిటల్‌ టెలికాం విశ్లేషకుడు నవీన్‌ కులకర్ని తెలిపారు.

Best Mobiles in India

English summary
Happy hours! Reliance Jio to disrupt broadband market with low pricing more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X