40 రోజుల్లో 100 కోట్లు.. ఏంటా వీడియో?

Posted By:

విభిన్న నృత్యాలతో కూడిన వీడియోలు ఆన్‌లైన్ ప్రపంచంలో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. 2011లో ‘కొలవరి డి' సంచలనం సృష్టించినట్లు, 2012ను ‘గ్యాంగ్నమ్ స్టైల్' కుదిపేసినట్లు, ‘హార్లెం షేక్ ' (Harlem Shake)అనే ప్రత్యేక హిప్ - హాప్ నృత్యం 2013ను కుదిపేస్తోంది. ఈ డ్యాన్స్ ఒరిజినల్ వర్షన్ వీడియోకు 40 రోజుల్లో 100కోట్ల వీక్షణలు దక్కినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

గ్యాంగ్నమ్ స్టైల్ వీడియోతో పోలిస్తే తక్కువ సమయంలో హార్లెం షేక్ వీడియోలను బిలియన్ వీక్షణలు దక్కినట్లు సదరు అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే టాప్ స్థానంలో కొనసాగుతున్న గ్యాంగ్నమ్ స్టైల్ వీడియోను వీక్షణల పరంగా ‘హార్లెం షేక్ ' అధిగమించగలదని అధ్యయనంలో పాల్గొన్న రిసెర్చర్ ధీమా వ్యక్తం చేసారు.

40 రోజుల్లో 100 కోట్లు.. ఏంటా వీడియో?

అసలీ హార్లెం షేక్ అంటే ఏంటి..? హార్లెం షేక్ అనేక పాశ్చాత్య హిప్ హాప్ నృత్యాన్ని అమెరికాకు చెందిన విద్యుత్ సంగీతకారుడు ఇంకా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత Baauer మే,2012లో సంకల్పించారు. ఈ నృత్యంలో బాగంగా బృందంతో కూడిన వ్యక్తులు వివిధ మోడళ్ల మాస్క్‌లు ఇంకా సూట్ మాదిరి దుస్తులను ధరించి వివిధ భంగిమల్లో నర్తిస్తుంటారు.

హార్లెం షేక్ వీడియోను చూడలనుకుంటున్నారా క్లిక్ చేయండి:

<center><iframe width="600" height="360" src="http://www.youtube.com/embed/8vJiSSAMNWw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting