హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: నెలకు Rs.1,249లకే 2TB FUP డేటా

|

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు 300 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను సరసమైన ధరకు అందిస్తోంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అదే 300 Mbps ప్లాన్‌ను అన్ని నగరాల్లో 2019 ప్రారంభంలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. 2018 అక్టోబర్ లో హాత్వే 300 Mbps ప్లాన్‌ను నెలకు రూ.1,699 ల ధర వద్ద ప్రవేశపెట్టింది.

300 Mbps ప్లాన్‌

ప్రస్తుతం హాత్వే బ్రాడ్‌బ్యాండ్ 300 Mbps ప్లాన్‌ను నెలవారీ ప్రాతిపదికన అందించకుండా దానికి బదులుగా ఆరు నెలలు మరియు 12 నెలల ప్రాతిపదికన అందిస్తోంది. ఒక కస్టమర్ 12 నెలలకు ఎంచుకుంటే వినియోగదారు చెల్లించాల్సిన మొత్తం రూ.14,999. అంటే నెలవారీ ధర 1,249 రూపాయలు. 6 నెలలకు ఎంచుకుంటే వినియోగదారు చెల్లించాల్సిన మొత్తం రూ .9,999. అంటే నెలవారీ ధర 1,666 రూపాయలు అంతేకాకుండా వినియోగదారులు రూ.16,399 విలువైన వై-ఫై మెష్ సొల్యూషన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుతం చెన్నై నగరంలో మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రయోజనాల

ఇది హాత్వే అందిస్తున్న ప్లాన్ ఇక ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ప్రతి నెలా 300 Mbps వేగంతో 2TB FUP డేటాను పొందవచ్చు. దాని తరువాత 5 Mbps వేగంతో FUP డేటాను ఆస్వాదించగలుగుతారు. పైన చెప్పినట్లుగా హాత్వే నుండి వచ్చిన ఈ ప్రణాళిక ఆరు నెలల మరియు ఒక సంవత్సరం చందాలలో మాత్రమే లభిస్తుంది.

 

జియోఫైబర్ ప్లాటినం ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్జియోఫైబర్ ప్లాటినం ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

వై-ఫై మెష్ సొల్యూషన్‌

అదనంగా హాత్వే వినియోగదారులకు రూ.16,399 విలువైన వై-ఫై మెష్ సొల్యూషన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ వై-ఫై సొల్యూషన్‌న్ని వినియోగదారులకు అందించడానికి హాత్వే టిపి-లింక్‌తో జతకట్టింది. హాత్వే ప్రకారం వై-ఫై మెష్ సొల్యూషన్ మొత్తం మూడు వై-ఫై బ్యాండ్లను కలిగి ఉంటుంది. దీనిని అమెజాన్ అలెక్సా ద్వారా కూడా నియంత్రించవచ్చు.

 

జియోఫైబర్ 4K సెట్-టాప్ బాక్స్: మార్కెట్లో ఎందుకు బిన్నంగా ఉంది?జియోఫైబర్ 4K సెట్-టాప్ బాక్స్: మార్కెట్లో ఎందుకు బిన్నంగా ఉంది?

హైదరాబాద్ లో హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

హైదరాబాద్ లో హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ కొంతకాలంగా వినియోగదారులకు కొన్ని ఆసక్తికరమైన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను అందిస్తోంది. హైదరాబాద్ నగరంలో ISP ఒక ఆఫర్‌ను అందిస్తోంది. దీని కింద వినియోగదారులు 50 Mbps ప్లాన్‌ను అపరిమిత FUPతో నెలకు కేవలం 399 రూపాయలకు పొందవచ్చు. చెన్నై నగరంలో కూడా 300 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు కొన్ని ఆసక్తికరమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కంపెనీ అందిస్తోంది.

చెన్నైలో మరిన్ని హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

చెన్నైలో మరిన్ని హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

చెన్నైలో హాత్వే కంపెనీ 300 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు మరో మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఈ జాబితాలో మొదటి ప్లాన్ G పాన్ ప్లాన్ దీని ధర నెలకు రూ.949. ఇది నెలకు 100 Mbps వేగంతో 1000GB FUP డేటాను అందిస్తుంది. దీనిని మూడు నెలలకు రూ.2,847, ఆరు నెలలకు రూ. 5,694 మరియు 12 నెలలకు రూ.11,388 ల చొప్పున అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్

చెన్నైలోని హాత్వే బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న మిగిలిన రెండు ప్లాన్‌లు G పాన్ హీరో మరియు G పాన్ టర్బో. ఇవి 150 ఎమ్‌బిపిఎస్ మరియు 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో వస్తాయి. ఈ రెండు ప్లాన్‌లు నెలకు 1000GB FUP పరిమిత డేటాను అందిస్తాయి. Gpon Hero ప్లాన్ ధర నెలకు రూ. 999. Gpon Turbo ప్లాన్ ధర రూ. 1,049. ఇవి హాత్వే బ్రాడ్‌బ్యాండ్ నుండి వస్తున్న సరసమైన హై-స్పీడ్ ప్లాన్‌లు. Gpon Hero మరియు Gpon Turbo రెండింటినీ మూడు నెలల, ఆరు నెలల మరియు ఒక సంవత్సరం ప్యాకేజీలలో కూడా పొందవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Hathaway 300 Mbps Broadband Plan Now Available at Rs.1,249

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X