Hathway 150 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు ఇవే!!! ధర కూడా తక్కువే

|

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ముందు నుంచి కూడా దేశం అంతటా అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తున్న హాత్వే మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలో 150Mbps వేగంతో పలు రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించడం ప్రారంభించింది. హాత్వే సంస్థ ఇప్పుడు అందిస్తున్న 150Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను పొందే విధానం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

హాత్వే అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను వినియోగదారులు నెలవారి ప్రాతిపదికన పొందడానికి అందుబాటులో లేదు. ఈ ప్లాన్ ను ఆరు నెలలు మరియు 12 నెలలకు కొనుగోలు చేయవలసి ఉంటుంది. కస్టమర్ 6 నెలల ప్లాన్‌ను కొనుగోలు చేసినా లేదా 12 నెలల ప్లాన్‌ను కొనుగోలు చేసినా ప్రయోజనాలు ఒకే రకంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అదనపు డేటా ప్రయోజనాలు లభించవు. అన్ని టెలికాం సర్కిల్‌లలో ఈ 150 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లభిస్తుంది.

 

Also Read: ధర రూ.10,000 ల లోపు బెస్ట్ టీవీ లు ఇవే !Also Read: ధర రూ.10,000 ల లోపు బెస్ట్ టీవీ లు ఇవే !

హాత్వే 150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

హాత్వే 150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలు

6 నెలల చెల్లుబాటుతో రూ .4,800 ధర వద్ద 150 Mbps వేగంతో లభించే హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ నెలకు రూ.800 ధరకు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే 12 నెలల చెల్లుబాటు కోసం ఈ ప్లాన్‌కు రూ.9,600 ఖర్చవుతుంది. ఇది కూడా నెలకు అదే రూ.800 లకు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్ తో నెలకు 1,200GB డేటాను పొందుతారు. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ స్పీడ్ 5 Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌తో ఎటువంటి ఇతర ప్రయోజనాలు అందుబాటులో లేవు.

 

Also Read: Samsung కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M51 ఇండియాలో లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం..Also Read: Samsung కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M51 ఇండియాలో లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం..

హాత్వే ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

హాత్వే ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

హాత్వే సంస్థ తన వినియోగదారులకు మరిన్ని ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో ఒకటి 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ప్రస్తుతం వినియోగదారులకు అందించే అత్యధిక వేగవంతమైన ఇంటర్నెట్ ప్లాన్ 300 Mbps వేగంతో వస్తుంది. హాత్వే అందించే సేవల గురించి మీరు తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఇది వివిధ టెలికాం సర్కిల్స్ వివిధ రకాల ధరల వద్ద తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. కాకపోతే ప్రతి టెలికం సర్కిల్‌లో 300 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ లేదా 150 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ అందుబాటులో లేదు.

Best Mobiles in India

English summary
Hathway Broadband Plans Starts at Rs. 800 and Offers 150 Mbps Speed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X