మల్టీ టీవీ ప్లాన్‌ను నిలిపివేసిన హాత్వే

|

టాటా స్కై అడుగుజాడలను అనుసరించి హాత్వే తన మల్టీ-టీవీ ప్రణాళికను నిలిపివేసినట్లు తెలిసింది. అంతేకాకుండా వినియోగదారులు ఇప్పుడు పూర్తి నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) చెల్లించాల్సి ఉంటుంది.రెండవ మరియు అంత కంటే ఎక్కువ టీవీ కనెక్షన్ల కోసం దాని చందాదారులు పూర్తి ఎన్‌సిఎఫ్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

hathway discontinues multi tv plan now subscribers will have to pay full ncf fee

వినియోగదారులు రెండవ కనెక్షన్ కోసం స్వతంత్రంగా ఛానెల్‌లను ఎంచుకోవచ్చు. గతంలో వినియోగదారులు బహుళ టీవీ కనెక్షన్ల కోసం ఒకే ఛానెల్‌లను తీసుకోవలసి వచ్చింది.

స్టాండర్డ్ డెఫినిషన్

స్టాండర్డ్ డెఫినిషన్

స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డి) 100 ఛానెళ్ల వరకు గల నెట్‌వర్క్ సామర్థ్యాన్ని సవరించి దాని ధర నెలకు రూ.130గా ఉంచారు.యూజర్లు అదనంగా మరో 25 ఎస్‌డి ఛానెళ్లను జోడించినచో హాత్‌వే నెలకు అదనంగా రూ.20 వసూలు చేస్తుంది. చందాదారులు వారి రెండవ సభ్యత్వంలో 100 ఎస్డి ఛానెళ్లను ఎంచుకుంటే వారు ఎన్‌సిఎఫ్‌లో పన్నులతో సహా రూ .153 చెల్లించవలసి ఉంటుంది.

మల్టీ-టీవీ కనెక్షన్లు:

మల్టీ-టీవీ కనెక్షన్లు:

ముఖ్యంగా టాటా స్కై మరియు హాత్వే మల్టీ-టీవీ కనెక్షన్ల కోసం ఒకే విధంగా వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా మల్టీ-టీవీ కనెక్షన్ ప్రణాళికలను నిలిపివేసిన తరువాత టాటా స్కై తన కొత్త రూమ్ టీవీ సర్వీస్ ను ప్రవేశపెట్టింది. మల్టీ-టీవీ కనెక్షన్ కోసం ఛానెల్ ప్యాక్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులకు మంచి మార్గాన్ని అందించడానికి కంపెనీ దీనిని పరిచయం చేసింది. చందాదారులు రెండవ కనెక్షన్లలో తమకు నచ్చిన కంటెంట్‌ను సజావుగా ఎంచుకోవచ్చు మరియు ఎంచుకున్న కంటెంట్ కోసం మాత్రమే చెల్లించవచ్చు.చందాదారుడు ఎంచుకున్న రెండవ కనెక్షన్ ఇప్పుడు ఒకే చందాదారుడి ID కింద ఉంటాయి. ఇంట్లో మొదటి కనెక్షన్ కోసం ఎంచుకున్న బేస్ ప్యాక్ నుండి వేర్వేరు ఛానెల్స్ & సేవలను కలిగి ఉంటాయి అని టాటా స్కై చెప్పారు.

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ :

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ :

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ఇటీవలే 125Mbps ప్లాన్‌ను కేవలం 549 రూపాయల ధరతో పునరుద్ధరించింది.కంపెనీ అందించే 125Mbps ప్లాన్ థండర్ ప్లాన్‌లో భాగంగా చందాదారులకు ఎంచుకోవడానికి మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా రూ .549,రూ .599, రూ .649 ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇంకా హాత్వే ఆరు నెలల బ్రాడ్బ్యాండ్ ప్లాన్ మరియు వార్షిక సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్:

100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్:

పైన పేర్కొన్న ఛార్జీలు వినియోగదారు చెల్లించాల్సిన నెలవారీ అద్దె రుసుము అని గమనించండి. ఇంకా పైన పేర్కొన్న బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళిక ప్రస్తుతం హైదరాబాద్ మరియు కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా 100Mbps ప్లాన్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. 125 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ మాదిరిగానేపైన పేర్కొన్న ఛార్జీలు వినియోగదారు చెల్లించాల్సిన నెలవారీ అద్దె రుసుము అని గమనించండి. ఇంకా, పైన పేర్కొన్న బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళిక ప్రస్తుతం హైదరాబాద్ మరియు కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా 100Mbps ప్లాన్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. 125 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ మాదిరిగానే 100 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ కూడా రూ .499, రూ 549, రూ .599 వంటి మూడు సభ్యత్వాలలో ఎంచుకునేందుకు వీలు ఉంటుంది.

Best Mobiles in India

English summary
hathway discontinues multi tv plan now subscribers will have to pay full ncf fee

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X