సునామీ దెబ్బకు హెచ్‌సిఎల్ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హొమ్ అవకాశం

By Super
|
సునామీ దెబ్బకు హెచ్‌సిఎల్ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హొమ్ అవకాశం
దేశంలో అతి పెద్దదైన సాప్ట్‌వేర్ కంపెనీ హెచ్‌సిఎల్ కూడా జపాన్‌లో సంభంవించినటువంటి సునామీ దెబ్బకు విలవిలలాడుతుంది. ఇందుకు గాను హెచ్‌సిఎల్ ఉద్యోగులు గురించి సత్వరం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జపాన్‌లో నివశిస్తున్నటువంటి హెచ్‌సిఎల్ ఉద్యోగులకు ఇంటి దగ్గరనుండి పని చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇది కుదరని మరికోంత మంది ఉద్యోగులకు జపాన్‌లో ఉన్న వేరే లోకేషన్లు ఒకాసా లేదా చైనా, ఇండియా, సింగపూర్‌ లలో నివసిస్తూ జపాన్ టైమింగ్స్‌కి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

ఈ సందర్బంలో హెచ్‌సిఎల్ సీనియర్ లీడర్ షిప్ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ క్షేమంగానే ఉన్నారని అన్నారు. అక్కుడున్నటువంటి ఉద్యోగులతో ప్రతిరోజు సంభాషణలు కోనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఇది మాత్రమే కాకుండా రాబోయే కొన్ని రోజులలో ఇండియాలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు జపాన్ వెళ్శి అక్కడున్న మిగతా ఉద్యోగులుకు కొంత భరోసా ఇచ్చి సపోర్టింగ్‌గా నిలుస్తామని తెలియజేశారు.

 

జపాన్‌ సునామీ సర్వస్వం కోల్పోయిన హెచ్‌సిఎల్ ఉద్యోగులకుగాను ఓపెన్ హౌస్ లాంటివి తీసుకుంటామని అన్నారు. ఈ ఓపెన్ హైస్‌లు జపాన్‌లో అన్ని లోకేషన్స్‌లో తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జపాన్‌లో ఉన్న ఉద్యోగుల సెక్యూరిటీ విషయంపై ఇప్పటికే జపాన్‌లో ఉన్న డిప్లమాటిక్ ఏజెన్సీస్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌సిఎల్ ఉద్యోగుల వారి ప్యామిలీతో మాట్లాడుకోవడానికి సెలవులు తీసుకునే విషయంలో వారి మేనేజర్స్‌ని సంప్రదించవలసిందిగా కోరారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X