మర్జోక్ హ్యాకింగ్‌లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ పాత్రపై ప్రశ్న

Posted By: Staff

మర్జోక్ హ్యాకింగ్‌లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ పాత్రపై ప్రశ్న

లండన్: రూపర్ట్ మర్జోక్ న్యూస్ ఇంటర్నేషనల్‌తో గల సంబంధాలపై లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ హోం ఎఫైర్స్ కమిటీ ఇండియన్ ఐటి దిగ్గజం హెచ్‌సి ఎల్ టెక్నాలజీస్ ను బ్రిటన్ లో ఫోన్ హేకింగ్ వివాదాలలో మునిగి వివరించాలంటూ కోరింది. దీనికి సంబంధించి కమిటీ ఛైర్మన్ కీత్ వాజ్ హెచ్ సి ఎల్ కంపెనీ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. న్యూస్ ఇంటర్నేషనల్, హెచ్ సి ఎల్ కు దాని ఇ మెయిల్స్ హెచ్ సి ఎల్ రికార్డులనుండి తొలగించాల్సిందిగా కోరింది. ఈ అంశం మాజీ స్కాటిష్ సోషలిస్టు పార్టీ నేత టామీ షెరిడియన్ ను విచారణ చేస్తున్నపుడు వెల్లడించబడింది. అయితే, తర్వాతి దశలో తొలగించాలని కోరిన ఇ-మెయిళ్ళు లండన్ లోని ఒక వేర్ హౌస్ లోనే భధ్రంగా ఉన్నట్లు తేలింది.

కీత్ వాజ్ రాసిన లేఖలో మూడు ప్రశ్నలు వేయబడ్డాయి. ఒకటి న్యూస్ ఇంటర్నేషనల్ కు హెచ్ సి ఎల్ తో ఏవైనా కాంట్రాక్టులున్నాయా ? న్యూస్ ఇంటర్నేషనల్ ఇ - మొయిళ్ళు హెచ్ సి ఎల్ తనవద్ద భద్ర పరచిందా ? న్యూస్ ఇంటర్నేషనల్ తన ఇ మెయిళ్ళను రికార్డుల నుండి తొలగించాలని హెచ్ సి ఎల్ కోరిందా ? అనేవిగా వున్నాయి. న్యూస్ ఇంటర్నేషనల్ సంస్ధ దాని పాత పేరు అయిన న్యూస్ ఆఫ్ ది వరల్డ్ తో హెచ్ సి ఎల్ సంస్ధకు క్లయింట్ గా వుండేది. 2009 లో చేసుకున్న ఐటి అవుట్ సోర్సింగ్ ఒప్పందం మేరకు హెచ్ సి ఎల్ న్యూస్ ఇంటర్నేషనల్ సంస్ధ యొక్క ఐటి వసతులను నిర్వహించేది.

లండన్ లోని హౌస్ ఆప్ కామన్స్ లో ఫోన్ హ్యకింగ్ లు చర్చకు వచ్చినపుడు హెఛ్ సి ఎల్ కంపెనీ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ మాత్రం తాము గతంలో కానీ లేదా ప్రస్తుతంలో కానీ, ప్రపంచంలోని తమ సంస్ధల స్టోరేజీలో ఎక్కడా న్యూస్ ఇంటర్నేషనల్ కు చెందిన డాటాను నిలువ చేయలేదని ధృవ పరచింది. కనుక లేని దానిని తొలగించటం అసాధ్యం అని, ఇదంతా తప్పు దోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ప్రచారం చేయబడుతోందని హెచ్ సి ఎల్ తెలుపుతోంది. తమ కంపెనీ ఎక్కడ వున్నప్పటికి దాని క్లయింట్ల గౌరవాన్ని కాపాడుతూ స్ధానిక ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించబడుతుందని, అదే విధంగా గత రెండు నెలలుగా న్యూస్ ఇంటర్నేషనల్ విషయంలో కూడా జరుగుతున్న దర్యాప్తుల కారణంగా పోలీసులకు సహకరిస్తోందని, తమ క్లయింట్ల పరువు ప్రతిష్టలు కాపాడటానికిగాను ప్రస్తుత దశలో తాము ఇంతకంటే అదికమైన వివరణ ఇవ్వలేమని కూడా తెలిపింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot