ఇవా చాట్‌బోట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు

Posted By: BOMMU SIVANJANEYULU

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్ల కోసం సెన్స్‌ఫోర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్ ఇవా (Eva) ఇప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో వర్క్ అవుతోంది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇవా చాట్‌బోట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు

తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించుకుంటోన్న హెచ్‌డిఎఫ్‌సీ ఖతాదారులు ఇండియన్ ఇంగ్లీష్‌లో మాట్లాడతూ ఈ చాట్‌బోట్‌తో ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది.

తాము అందుబాటులోకి తీసుకువచ్చిన ఇవా చాట్‌బోట్ భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ చాట్ బోట్‌గా నిలుస్తుందని హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది. 85 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోన్న ఈ చాట్‌బోట్ ఇప్పుడు వరకు 50 లక్షల యూజర్లకు సమాధానాలిచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఇవా చాట్‌బోట్‌లో లేటెస్ట్‌గా యాడ్ అయిన గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఇంటిగ్రేషన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులతో మరింత క్లోజ్‌గా ఇంటరాక్ట్ కాగలదు. ఇవా వాయిస్ ఇంటరాక్షన్‌ను స్మార్ట్‌ఫోన్‌లతో పాటు

పాటు డెస్క్‌టాప్స్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేసి "Ok Google, talk to HDFC Bank" అని చెప్పటం ద్వారా ఇవా చాట్‌బోట్‌తో ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుంది.

బీటా వెర్షన్ లో వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే!

ఇవా పూర్తి పేరు ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్. ఈ చాట్‌బోట్‌ను కట్టింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అలానే ఏ.వేర్ అనే ఎన్ఎల్‌పీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా సెన్స్‌ఫోర్త్ సంస్థ అభివృద్ధి చేసింది. విప్లవాత్మక కన్వర్జేషనల్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయటంలో ఇవా చాట్‌బోట్ కీలక పాత్ర పోషిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

ఇవా చాట్‌బోట్ ప్రస్తుతానికి బ్యాంకింగ్ సంబంధిత ఇంటెంట్స్, ట్రాక్స్ అలానే కస్టమర్ ఇష్యూస్‌ను సంబంధించి 50,000 రకాల సిమాంటిక్ వేరియేషన్స్‌ను హ్యాండిల్ చేయగలుగుతుంది.

English summary
HDFC Bank's Artificial Intelligence (AI) enabled chatbot, Eva, will now reportedly work with Google Assistant.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot