హెడ్‌ఫోన్స్ చెవులకు ఎలా ప్రమాదం చేస్తాయో తెలుసుకోండి

సెల్‌ఫోన్ల పుణ్యమా అంటూ.. హెడ్‌ఫోన్స్‌ను చాలామంది తెగ వాడేస్తున్నారు. బస్సుల్లో వెళ్లే సమయంలోను, నడిచేటప్పుడు, ఖాళీ సమయాల్లోను టైంపాస్‌ కోసం పాటలు వినేందుకు మనం ఆసక్తి చూపుతాం. ఇలా వినేందుకు ఇప్పుడు

|

సెల్‌ఫోన్ల పుణ్యమా అంటూ.. హెడ్‌ఫోన్స్‌ను చాలామంది తెగ వాడేస్తున్నారు. బస్సుల్లో వెళ్లే సమయంలోను, నడిచేటప్పుడు, ఖాళీ సమయాల్లోను టైంపాస్‌ కోసం పాటలు వినేందుకు మనం ఆసక్తి చూపుతాం. ఇలా వినేందుకు ఇప్పుడు హెడ్‌ఫోన్స్‌ వాడకం ఎక్కువైపోతోంది. అయితే హెడ్‌ఫోన్స్‌ వాడడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. న్యూయార్క్‌ ఆరోగ్య విభాగం జరిపిన సర్వేలో హెడ్‌ఫోన్స్‌ని అధికంగా ఉపయోగించడం వల్ల చెవులకు ప్రమాదం ఉంటుందని తేలింది. ఇప్పుడు మనం చూసే జనాల్లో ఎక్కువమంది చెవుల్లో హెడ్‌ఫోన్స్‌తో కనిపిస్తుంటారు. ఇలా ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు.

హెడ్‌ఫోన్స్ చెవులకు ఎలా ప్రమాదం చేస్తాయో తెలుసుకోండి
చెవి వినపడకుండా పోయే అవకాశాలు

ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా మనం అవసరానికి మించిన వాల్యూమ్ పెట్టుకుంటే మ్యూజిక్ సౌండ్ బయటికి వినిపిస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ శబ్దంతో పాటలు వినడం ఈ సౌండు చెవిలోని నరాలను ఎక్కువగా బాధిస్తుంది. దాంతో చెవి వినపడకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. అదేపనిగా ఇయర్ ఫోన్స్ వాడేవారు ప్రతి గంటకు ఒక్కసారైనా వాటిని తొలగిస్తూ ఉండాలి.

చెవి ఇన్‌ఫెక్షన్స్

చెవి ఇన్‌ఫెక్షన్స్

ఒకరు వాడే ఇయర్ ఫోన్స్ మరొకరు వాడితే కూడా చెవి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇతరుల ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉండేవారి చెవులను పరిక్షించునప్పుడు వాళ్లలో దాదాపు 98 మంది చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు పరిశోధనలో తేలింది.

గంటపాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే

గంటపాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే

వీటి వాడక వలన చెవుల్లో వేడి, తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఓ గంటపాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ సమయంలో బ్యాక్టీరియాలు 700 రేట్లు పెరుగుతున్నట్లు అధ్యయనంలో స్పష్టం చేశారు.

4 వారాలకి ఒకసారి

4 వారాలకి ఒకసారి

ఈ ఇయర్ ఫోన్స్ ఎలా వాడాలంటే.. 4 వారాలకి ఒకసారి ఇయర్ బడ్స్‌ను మారుస్తూ ఉండాలి. ఇయర్ ఫోన్స్, బడ్స్‌లను అప్పుడప్పుడూ శానిటైజ్ చేస్తూ ఉండాలి. ఇతరులతో వీటిని పంచుకోవడం మంచిది కాదు. అలానే తక్కువ మోదాతులో మ్యూజిక్ వింటూ గంటకు ఒకసారి చెవులకు విశ్రాంతినిస్తూ ఉంటే.. ఎలాంటి సమస్యలు దరిచేరవు.

రోడ్ యాక్సిడెంట్స్

రోడ్ యాక్సిడెంట్స్

రోడ్డు వీధుల్లో సహా వీటిని చెవిలో పెట్టుకుని నడుస్తున్నారు. పక్కన ఏ వాహనాలు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించకుండా ఉండేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ ఇయర్ ఫోన్స్ కారణంగా చాలామంది చనిపోయారు. అయినను వీటిని వదలడం లేదు.

 నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ

నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ

60 సెం.మీ. దూరంలో ఉన్న అలారం చేసే శబ్దం 60 డెసిబుల్స్. దాన్నే మంచానికి దగ్గరగా ఉంచకూడదంటారు. ఇక హెయిర్ డ్రయ్యర్ సంగతి సరేసరి. చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే, పెద్ద శబ్దాలు దగ్గరగా వినడం రెండో కారణం అని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది.

  60 డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను

60 డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను

పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేం. ఇక దానికి చికిత్స ఉండదు. ఇక అప్పుడు హియరింగ్ ఎయిడ్ వాడాల్సిందే. లేదంటే జీవితాంతం చెవుడుతో బాధపడాల్సిందే. అందుకే 60 డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను దగ్గరగా వినడం హానికరమనే విషయాన్ని గుర్తించాలి.

Best Mobiles in India

English summary
Are headphones damaging young people's hearing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X