5జీ రేడియోషన్‌ కారణంగా పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయా..?

5జీ నెట్‌వర్క్ అఫీషియల్ లాంచ్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో చాలా మంది నెటిజనులు ఈ నెట్‌వర్క్ గురించి గూగుల్‌‌లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By GizBot Bureau
|

5జీ నెట్‌వర్క్ అఫీషియల్ లాంచ్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో చాలా మంది నెటిజనులు ఈ నెట్‌వర్క్ గురించి గూగుల్‌‌లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 5జీ రేడియోషన్ కారణంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి..? ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి..? అసలు 5జీ సురక్షితమేనా..? వంటి ప్రశ్నలకు ఎక్కువుగా వీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో శోధిస్తున్నారు.

 

బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ, టార్గెట్ గ్రూప్స్

బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ, టార్గెట్ గ్రూప్స్

అయితే, వీరు అడుగుతోన్న ప్రశ్నలకు గూగుల్ సరైన సమాధానాలను ఇవ్వలేకపోతోంది. దీని కారణం వీరు అడుగుతోన్న ప్రశ్నలలో ఖచ్చితమైన ఆపరేటివ్ పదం లోపించటమే. అయితే 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ అలానే టార్గెట్ గ్రూప్స్ (ప్రెగ్నెంట్ మహిళలు, నెలల పిలల్లు, చిన్నారులు, సీనియర్స్ ఇంకా అడల్ట్స్)ను బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

5జీ నెట్‌వర్క్ విడుదలకు రంగం సిద్థం...

5జీ నెట్‌వర్క్ విడుదలకు రంగం సిద్థం...

టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో ఉన్న జపాన్, దక్షిణ కొరియా, ఫిన్‌ల్యాండ్, అమెరికా వంటి దేశాలు 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ 5జీ నెట్‌వర్క్ విడుదలకు రంగం సిద్థం చేసుకుంటున్నాయి. దీంతో, ఆయా దేశాల్లో అతిత్వరలోనే 5జీ నెట్‌వర్క్ కమర్షియల్‌గా అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో 5జీ ఇంటర్నెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

5జీతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌..
 

5జీతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌..

త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ, మునుపెన్నడు ఆస్వాదించని సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 5జీ ఎంత స్పీడ్‌లో లభ్యమవుతుంది..?, ఎంత డేటాను ఖర్చు చేస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన జవాబులు లేవు. 2020 నాటికి ఈ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం కానుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై 5జీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. 3జీ, 4జీలతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ ఖరీదైన నెట్‌వర్క్‌‌గా అవతరించనుంది.

 

 

హై-నెట్ వర్క్ కెపాసిటీ, 10జీబీపీఎస్ వరకు డేటా స్పీడ్స్..

హై-నెట్ వర్క్ కెపాసిటీ, 10జీబీపీఎస్ వరకు డేటా స్పీడ్స్..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. మరో సంస్థ ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము 2015 అక్టోబర్‌ 13న అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హై-నెట్ వర్క్ కెపాసిటీ, 10జీబీపీఎస్ వరకు డేటా స్పీడ్, ఎనర్జీ ఇంకా కాస్ట్ ఎఫీషియన్సీ వంటి లక్షణాలను 5జీ నెట్‌వర్క్ కలిగి ఉండబోతోంది.

 

 

5జీ మిల్లీమీటర్ తరంగాలను వినియోగించుకుంటుంది...

5జీ మిల్లీమీటర్ తరంగాలను వినియోగించుకుంటుంది...

ఇక 5జీ నెట్‌వర్క్ కారణంగా సంభవించే ఆరోగ్య రుగ్మతలను అంచనా వేసినట్లయితే ఈ టెక్నాలజీ మిల్లీమీటర్ తరంగాలను వినియోగించుకుంటుంది. ఈ కారణంగా హై-ఫ్రీక్వెన్సీ రేడియోషన్ (3-300GHz) జనరేట్ అయ్యే అవకాశం ఉంది. మిల్లీమీటర్ తరంగాలు అనేవి నెట్‌వర్క్‌కు హైకెపాసిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఇదే సమయంలో టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు ఇవి తక్కువ కవరే‌జ్‌ను ప్రొవైడ్ చేస్తాయి. దీంతో 5జీ టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఎక్స్‌టెండ్ చేసేందుకు అనేక చిన్న సెల్ సైట్‌లను నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కారణంగా హై-లెవల్ రేడియేషన్ జనరేట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

 

 

లోవర్ రేడియేషన్ లెవల్స్ కారణంగా ఆరోగ్య రుగ్మతలు..

లోవర్ రేడియేషన్ లెవల్స్ కారణంగా ఆరోగ్య రుగ్మతలు..

ఫ్రీక్వెన్సీ అలానే వేవ్‌లెంగ్త్‌లను రేషియోషన్‌కు సంబంధించి కీలక భౌతిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ పెరుగుదల అనేది వేవ్‌లెంగ్త్‌ తగ్గుదలకు దారితీస్తుంది. 3.75గిగాహెట్జ్ రేడియోషన్ లెవల్స్ అనేవి లోవర్ ఎనర్జీకి దారితీస్తాయి. లోవర్ రేడియేషన్ లెవల్స్ కారణంగా వేడి, అసౌకర్యం వంటి శారీరక రుగ్మతలు కలుగుతాయి.

తలెత్తే నష్టాలను వెంటనే అంచనా వేయలేం..

తలెత్తే నష్టాలను వెంటనే అంచనా వేయలేం..

లోవర్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా వ్యాప్తి చెందే రేడియేషన్ కణజాలంలోకి లోతుగా దూసుకువెళుతుందని నిపుణులు చెబుతున్నారు. 2.45గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ వల్స్‌తో కూడిన రేడియోషన్ కండర కణజాలం పై 17 మిల్లీమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదట. ఇదే సమయంలో 3.75గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ లెవల్స్‌తో కూడిన రేడియోషన్ కండర కణజాలం పై 13 మిల్లీమీటర్ల మేర ప్రభావం చూపగలదట. ఈ కారణంగా తలెత్తే నష్టాలను వెంటనే గుర్తించటానికి వీలుండదట.

 

 

 

Best Mobiles in India

English summary
Health risks and hazards of 5G radiation.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X