ఇంటర్నెట్‌కు హార్ట్‌బ్లీడ్ ముప్పు!

|

హార్ట్‌బ్లీడ్ (Heartbleed) పేరుతో తెరపైకి వచ్చిన ఓ బగ్ (సాఫ్ట్‌వేర్ క్రిమి) ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంటర్నెట్ రక్షణ కోసం ఏర్పరుచుకున్న ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలోనే ఈ సమస్య ఉన్నట్లు నిపుణులు కొనుగొనటంతో ఇంటర్నెట్ కంపెనీలు తమ డేటాను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను శరవేగంగా అన్వేషిస్తున్నాయి. ఈ త్రీవమైన భద్రతా ముప్పు ఇంటర్నెట్‌లోని యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత ఇంకా రహస్య వివరాలను బట్టబయలు చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ వ్యవస్థ పై ఇంతలా ప్రభావం చూపుతున్న హార్ట్‌బ్లీడ్ బగ్ గురించి పలు కీలక అంశాలను ఇప్పుడు చర్చించుకుందాం..

 
ఇంటర్నెట్‌కు హార్ట్‌బ్లీడ్ ముప్పు!

హార్ట్‌బ్లీడ్ అంటే ఏంటి..?

ఇంటర్నెట్ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఎస్ఎస్ఎల్ (సెక్యూర్ సాకెట్ లేయర్) వ్యవస్థలో ఏర్పడిన బగ్ లేదా క్రిమినే హార్ట్‌బ్లీడ్‌గా పిలుస్తున్నారు. బగ్ అంటే వైరస్ ఎంతమాత్రమూ కాదు. ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినపుడు ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు తెలియకుండానే ఏర్పడే ఒక బలహీనతనే బగ్ అని అంటారు. హార్ట్‌బ్లీడ్ బగ్, హ్యాకర్ల దాడులను మరింత సులభతరం చేసేందుకు ఆస్కారమిస్తుంది. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సర్వర్లలోని డేటాను, యూజర్ల వ్యక్తిగత వివరాలను సునాయాశంగా దొంగిలించ అవకాశం ఉంటుందని విశ్లేషకులు వాపోతున్నారు.

ఓపెన్ ఎస్ఎస్ఎల్ అనే ఎన్‌క్రిప్షన్ వ్యవస్థ ఇంటర్నట్‌లో సర్వర్ల నుంచి సంబంధిత క్లయింట్‌లకు ప్రవహించే డిజిటల్ డేటాను హ్యాకర్లు, వైరస్‌లు ఇంకా ఇరత సైబర్ శక్తుల నుంచి రక్షిస్తుంటుంది. అలాంటి రక్షణాత్మకమైన వ్యవస్థలోనే సమస్య ఉందని తేలటంతో ఇంటర్నెట్ డేటాకు భద్రత లేదని తాజాగా వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఐటీ కంపెనీలకు సంబంధించి లక్షల సంఖ్యలో సర్వర్లు ఈ హార్ట్‌బ్లీడ్ బర్ భారిన పడ్డాయని సెక్యూరిటీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ సమస్యను గుర్తించి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికి, నెటిజనులు దృష్టికి వచ్చింది మాత్రం ఈ వారమే. ఈ బగ్‌ను తొలిసారిగా గూగుల్ చెందిన ప్రముఖ పరిశోధకులు నీల్ మెహతా గుర్తించినట్లు తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X