దోమలను మానిటర్ చేసేందుకు Abuzz

Posted By: BOMMU SIVANJANEYULU

మారుతోన్న వాతావరణ పరిస్థితులు ఇంకా అపరిశుభ్రత కారణంగా దోమలనేవి కాలంతో పనిలేకుండా విజృంభించేస్తున్నాయి. దోమకాటు కారణంగా మలేరియా డెంగ్యూ, జికా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులు
బెంబేలెత్తిస్తున్నాయి.

దోమలను మానిటర్ చేసేందుకు Abuzz

ఈ నేపథ్యంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బయో ఇంజినీర్ మను ప్రకాష్‌తో పాటు ఆయన రిసెర్చర్ల బృందం Abuzz పేరుతో ఓ యాప్ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మొబైల్ ఫోన్‌లను సపోర్ట్ చేయగలిగే ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా దోమ శబ్థాలను బట్టి వాటిని మానిటర్ చేసే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి...

దోమలు చేసే శబ్ధాలను బట్టి వాటి జాతులను ఈ సాఫ్ట్‌వేర్ ఐడెంటిఫై చేయగలుగుతుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ప్రాంతంలోని దోమల శబ్థాలను రకార్డ్ చేసి ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసే వీలుంటుంది. అయితే ఈ రికార్డింగ్ అనేది నాణ్యత ప్రమాణాలకు తగ్గినట్లుగా ఉండాలి.

బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ మరింత క్లియర్‌గా ఉండాలి...

శబ్థం రికార్డ్ అయ్యే సమయంలో ఫోన్ మైక్రోఫోన్‌కు, దోమకు మధ్య దూరం 10 సెంటీమీటర్లలోపే ఉండాలి. ఇదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా చాలా తక్కువుగా ఉండాలి. Abuzz యాప్ అక్టోబర్ 31న ప్రపంచానికి అందుబాటలోకి వచ్చింది.

మైక్రోపోన్ ఎక్కడ లోకేట్ అయి ఉందో తెలుసుకోవాలి..

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు సౌండ్ రికార్డింగ్ సౌకర్యంతో వస్తున్నాయి. యూజర్లు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా దోమల శబ్థాలను రికార్డ్ చేసే సమయంలో ముందుగా ఫోన్ మైక్రోపోన్ ఎక్కడ లోకేట్ అయి ఉందో తెలుసుకోవాలని మను ప్రకాష్‌ అంటున్నారు. మైక్రోఫోన్‌ను గుర్తించిన తరువాత సౌండ్ రికార్డర్ ఆన్ చేసి దోమలకు దగ్గరగా ఉంచినట్లయితే వాటి శబ్థాలు రికార్డ్ కాబడతాయని ఆయన తెలిపారు.

జియో కాయిన్ పేరుతో వెబ్‌సైట్, వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

డేటా మొత్తం ఆన్‌లైన్ మ్యాపింగ్‌లో...

రికార్డ్ అయిన శబ్థాన్ని Abuzz సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లయితే, అక్కడ ముందే పొందుపరచబడిన 20 రకాల దోమ జాతుల శబ్థాలతో మీరు పంపిన డేటాకు సంబంధించిన అల్గారిథమ్ మ్యాచ్ అయినట్లయితే, మీ సమీపంలో ఉన్నది ఏ జాతికి చెందిన దోమలనేవి తెలపబుడుతంది. ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే డేటా మొత్తం ఆన్‌లైన్ మ్యాపింగ్ రూపంలో అందబాటులో ఉంటుది. మ్యాప్‌ను ఒపెన్ చేయటం ద్వారా ఎక్కడెక్కడ ఎలాంది దోములు ఉన్నాయన్నది తెలుసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mosquitoes can be deadly, transmitting malaria, dengue, and Zika. But tracking them is tough.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot