రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

|

Reliance Jio 4జీ, ఇప్పడు అందరికి అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ సిమ్ కార్డ్స్ యాక్టివేషన్ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది.

రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Read More : Jio మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఎప్పటి నుంచి..?

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జియో సిమ్ కార్డులు పూర్తిగా యాక్టివేషన్ అయ్యేంతవరకు కొత్త సిమ్‌లు ఇవ్వవొద్దని రిలయన్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు, కంపెనీ ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక సిమ్ కార్డుల కొరత కూడా ఓ కారణమని తెలుస్తోంది. రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌లోని ఆకట్టుకునే అంశాలతో పాట నిరుత్సాహపరిచే అంశాలను ఓసారి పరిశీలించినట్లయితే...

Read More : లెనోవో నుంచి మూడు సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు, jio సపోర్ట్‌తో, ధరలు రూ.6,999 నుంచి ప్రారంభం

#1

#1

LTE-only నెట్‌వర్క్

రిలియన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్ కావటం. ఈ సౌలభ్యతతో జియో సిమ్ యూజర్లు నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలను ఫేస్ చేసే అవకాశముండదు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

 

#2

#2

VoLTE Calls

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

 

#3
 

#3

ఎస్ఎంఎస్ ఇంకా కాల్స్ పూర్తిగా ఉచితం...

రిలయన్స్ జియోలో వాయిస్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ పూర్తిగా ఉచితం. అయితే TRAI నిబంధనలు ప్రకారం రోజుకు మీరు 100 ఎస్ఎంఎస్‌లు మాత్రమే పంపుకోవాలి.

 

#4

#4

దేశవ్యాప్తంగా ఉచితం రోమింగ్

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఎటువంటి రోమంగ్ ఛార్జీలు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

 

#5

#5

వై-ఫై హాట్ స్పాట్స్

రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్స్‌లో భాగంగా వై-ఫై డేటాను కూడా యూజర్లకు అందిస్తోంది. ఈ డేటాను ఉపయోగించుకుని పబ్లిక్ ప్రాంతాల్లో రిలయన్స్ ఏర్పాటు చేసే జియో వై-ఫై హాట్ స్పాట్‌ల వద్ద ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

 

#6

#6

నిరుత్సాహపరిచే విషయం...

ఇప్పటికే రూ.50లో ఎటువంటి డేటా ప్యాక్‌ను రిలయన్స్ అనౌన్స్ చేయలేదు. జియో లాంచ్ సందర్భంగా 1 ఎంబి డేటాను 5 పైసులకు ఇస్తున్నట్లు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే 1జీబి డేటా రూ.50కు వస్తుంది. జియో నెట్‌వర్క్‌లో మీరు వాయిస్ కాల్స్ చేసుకోవాలంట ఏదో ఒక టారిఫ్ ప్లాన్‌ను తప్పనిసరిగా మీ డివైస్‌లో యాక్టివేట్ చేయించాల్సి ఉంటుంది.

 

#7

#7

నైట్ డేటా 3 గంటలు మాత్రమే..?

డిసెంబర్ 31, 2016 తరువాత రిలయన్స్ జియో ఆఫర్ చేసే అన్‌లిమిటెడ్ నైట్ డేటా అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో ఇతర టెలికం ఆపరేటర్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటలకు నైట్ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.

 

#8

#8

VoLTE సపోర్ట్‌లేని ఫోన్‌లలో జియో కాల్స్ వెళ్లవు

VoLTE సపోర్ట్‌ అందుబాటులోలేని 4జీ ఎల్టీఈ ఫోన్‌లలో నేరుగా జియో వాయిస్ కాల్స్ చేసుకోవటం సాధ్యం కాదు. జియో4జీవాయిస్ యాప్ ద్వారా మాత్రమే వాయిస్ కాల్స్ చేసుకోవల్సి ఉంటుంది.

 

#9

#9

సెప్టంబర్ 5 తరువాత జియో ప్రివ్యూ ఆఫర్ కాస్తా వెల్‌కమ్ ఆఫర్‌లా మారిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. వెల్‌కమ్ ఆఫర్‌లో పరిమితికి మించి డేటా వాడకూడదు. అంటే రోజుకు 4జీబి వరకు మాత్రమే డేటా వాడుకోవల్సి ఉంటుంది. అదికూడా 128కేబీపీఎస్ స్పీడ్ లిమిట్‌తోనే!.

 

#10

#10

రిలయన్స్ జియో ఫోన్‌లలో మీరు వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ఏదో ఒక టారిఫ్ ప్లాన్‌ను తప్పనిసరిగా మీ డివైస్‌లో యాక్టివేట్ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయించని పక్షంలో వాయిస్ కాల్స్ చేసుకునే వీలుండదు.

Best Mobiles in India

English summary
Here are 5 Advantages and 5 Disadvantages of Reliance Jio 4G SIM Against its Rivals. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X