భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

Written By:

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన భారత పర్యటనలో భాగంగా తమ సంస్థకు ఉపయోగపడే ఏ ఒక్క అభివృద్థిని వనరును వదిలిపెట్టడం లేదు. దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ మొదలుకుని యువత నైపుణ్యాలను ఉపయోగించుకునే అంశం వరకు అన్ని విభాగాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమచారం.

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

భారతీయ యువత నైపుణ్యాలను ఎంతగానో మెచ్చుకున్న కుక్ వారి సామర్థ్యాలున్నాయని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీతో చెప్పకనే చెప్పారు. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పై చేయి సాధించే క్రమంలో Refurbished ఐఫోన్‌లతో పాటు యాపిల్ డివైస్‌లను విక్రయించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో తమ భవిష్యత్ కార్యాచరణ పై వ్యూహాత్మక అడుగులతో ముందుకు సాగుతోన్న యాపిల్ రానున్న నెలల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పెను ప్రభావం చూపబోతోందనటానికి పలు ఆసక్తికర వాస్తవాలు...

Read More : 2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

యాపిల్ డివైస్‌లకు భారత్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యాపిల్ బ్రాండ్‌ను ఓ ప్రత్యేకమైన హోదాగా భావించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. గడిచిన రెండు సంవత్సరాలుగా భారత్‌లో యాపిల్ ఫోన్‌ల అమ్మకాలను పరిశీలిచినట్లయితే వృద్థి గణనీయంగా ఉంది. ఇందుకు కారణం యాపిల్ అందిస్తోన్న డిస్కౌంట్స్ ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లే.

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

లెనోవో, షియోమీ, సామ్‌సంగ్, సోనీ తరహాలో యాపిల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తే మార్కెట్ స్వభావమే మారిపోయే అవకాశముంది.

 

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

తమ ఐఫోన్, ఐప్యాడ్ డివైస్‌ల మ్యాపింగ్‌కు సంబంధించి ఓ మ్యాప్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యాపిల్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించింది. యాపిల్ మ్యాప్స్ భారత్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యాపిల్ ఉత్ఫత్తులను ఇష్టపడే వారి సంఖ్య భారత్‌లో మరింత పెరుగుతుంది.

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

యాప్ డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ను యాపిల్ కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో ప్రారంభించింది. భారత్‌లో ఐఓఎస్ డెవలపర్ కమ్యూనిటీ వృద్ధిచెందేందుకు ఈ డెవలప్ సెంటర్ ఎంతగానో దోహదం కానుంది. యాపిల్ కంపెనీకి సంబంధించి అన్నిరకాల ఉత్పత్తులకు యాప్లు తయారు చేయనున్నారు. వీటితో పాటు ఐఓఎస్, మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్లకు యాప్లను రూపొందించనున్నారు. యాపిల్ లో భారత్ కు ఇంది మంచి పరిణామం.

భవిష్యత్ భారత్ యాపిల్‌దేనా..?

ఐఫోన్ ఇండియా ఎడిషన్ పేరుతో యాపిల్ తన ఐఫోన్‌లను భారత్‌లోనే తయారు చేసి గూగుల్ ఆండ్రాయిడ్‌కు పోటీగా వాటిని తక్కువ ధరల్లో విక్రయించే ఆలోచన చేస్తోంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినట్లయితే భారత్‌లో యాపిల్ భవిష్యత్‌కు తిరుగుండదేమో!!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are 5 ways Apple can capture the Indian smartphone market in a couple of months. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot