రైల్ బడ్జెట్ 2016, టెక్నాలజీకి ప్రాధాన్యత ఎంత..?

Written By:

2016-17 రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా స్మార్ట్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు రైల్వే భద్రతకు పెద్దపీట వేయటంతో పాటు ప్రయాణీలకు మరింత భరోసానిచ్చేవిగా ఉన్నాయి. రైల్వే స్టేషన్లను స్మార్ట్ రైల్వే స్టేషన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్‌లను ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.249కే VR హెడ్‌సెట్, త్వరపడండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్‌లలో వై-ఫై సర్వీసులను అందించేందుకు భారత రైల్వే శాఖ గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్‌లో భాగంగా ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. ఈ ఉచిత వై-ఫై సేవలు రానున్న రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్, రైల్‌టెల్, గూగుల్‌లు సంయుక్తంగా ఇప్పటికే ముంబై సెంట్రల్ స్టేషన్‌లో ఉచిత సేవలను లాంచ్ చేసాయి.

 

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

రైల్వే స్టేషన్‌లలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్రక్రియ 2015లో ప్రారంభమైనప్పటికి ఇప్పటివరకు కేవలం 45 స్టేషన్‌లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో భాగంగా ఈ సర్వీసును క్యాటగిరి ఏ1, క్యాటగిరి ఏ సెగ్మెంట్‌లలో ఉన్న 400 స్టేషన్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా డామినోస్, పిజ్జా, ట్రావెల్ ఖానా, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ వంటి ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

 

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

రైల్వే శాఖ అధికారిక ఈ-కామర్స్ పోర్టల్ అయిన IRCTCకు, వెబ్ ట్రాఫిక్ నిత్యం రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో అదనపు ఇ-కామర్స్ సెక్షన్‌ను జోడించి ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. టార్గెటెడ్ యాడ్స్‌ను కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తూ 2020 నాటికి 4,000 కోట్ల ఆదాయాన్ని అర్జించాలన్నది రైల్వే శాఖ లక్ష్యమని బడ్జెట్‌ విడుదల సందర్భంగా మంత్రి తెలిపారు.

 

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

భవిష్యత్‌లో తాము చేపట్టబోయే ప్రముఖ ప్రాజెక్టలను మానిటర్ చేసేందుకు ఏరియల్ డ్రోన్‌లను ఉపయోగించుకోనున్నట్లు రైల్వే బడ్జెట్‌లో భాగంగా మంత్రి వెల్లడించారు.

 

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

ప్రయాణీకుల భద్రతకు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ 331 ప్రముఖ రైల్వే స్టేషన్‌లలోని ప్లాట్‌ఫామ్‌ల పై హైక్వాలిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్యాసెంజర్లకు ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసేందుకు 2,000 రైల్వే స్టేషన్‌లలో 20,000కు పైగా సెంట్రల్ కనెక్టెడ్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్యాసెంజర్ల వినోదపు అవసరాలను తీర్చే క్రమంలో ఎఫ్ఎమ్ రేడియో సపోర్ట్ , LED-lit అట్రాక్టివ్ యాడ్ బోర్డ్స్ ఇంకా వెండింగ్ మెచీన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.

 

రైల్ బడ్జెట్ 2016-17లో చేసిన 6 ఆసక్తికర టెక్నాలజీ అనౌన్స్‌మెంట్స్

రైల్వే బడ్జెట్ 2016లో భాగంగా ట్రాక్ మెనేజ్‌మెంట్ సిస్టంను మంత్రి అధికారికంగా అనౌన్స్ చేసారు. ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయబడిన ఈ ట్రాక్ నిర్వహణ వ్యవస్థ ద్వారా రైల్వే శాఖ ట్రాక్ నిర్వహణకు సంబంధించిన మరమ్మతు పనులను రియల్ టైమ్ బేసిస్‌లో పర్యవేక్షించవచ్చు. ఈ పక్రియ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే రైలు ఆలస్యాలను నివారించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are the tech announcements from Rail Budget 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot