ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సప్ యుధ్దం ఎలా చేస్తుందో చూడండి

వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది.అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్య

|

వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది.అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్యూస్ వాట్సప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎలాగైనా వీటిని కట్టడి చేయాలని సోషల్ మీడియా దిగ్గజాలు భావిస్తున్నాయి.

 
ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సప్ యుధ్దం ఎలా చేస్తుందో చూడండి

ఇందులో భాగంగా సెక్యూరిటీ ఫీచర్లను పకడ్బందీగా తీసుకువసస్తున్నాయి. దీని కోసం వాట్సప్ నాస్కాంతో కలిసి యూజర్లకు ట్రయినింగ్ కూడా ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ ఫేక్ న్యూస్ మీద వాట్సప్ యుద్ధం ఎలా చేస్తుందో ఓ సారి చూద్దాం.

షేరింగ్ అలర్ట్

షేరింగ్ అలర్ట్

వాట్సప్ యూజర్లు ఏదిబడితే అది షేరింగ్ చేయకుండా ఉండేందుకు వారికి ట్రయినింగ్ ఇస్తోంది. గతేడాది ప్రారంభించిన ఈ ట్రయినింగ్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళుతోంది. నాస్కాంతో కలిసి ఫేక్ న్యూస్ కట్టడికి కృషి చేస్తోంది.

ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్

ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్

రానున్న లోక్‌స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న 1 ల‌క్ష మంది సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు.. త‌ప్పుడు స‌మాచారాన్ని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ఈ సంస్థ‌లు అంద‌జేయ‌నున్నాయి.అందులో భాగంగానే ఈ రెండు సంస్థ‌లు ప్ర‌స్తుతం భాగ‌స్వామ్యం అయ్యాయి.

డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్
 

డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు ఈ రెండు సంస్థ‌ల ప్ర‌తినిధులు డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్ ఇవ్వ‌నున్నారు. ట్రెయినింగ్‌లో భాగంగా యూజ‌ర్ల‌కు.. త‌ప్పుడు స‌మాచారాన్ని ఎలా గుర్తించాలి, దాని ప‌ట్ల రిపోర్ట్ ఎలా చేయాలి, అలాంటి స‌మాచారం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఎలా ఉండాలి.. అనే విష‌యాల‌ను ప్రాక్టిక‌ల్‌గా నేర్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో మొద‌టి ట్రెయినింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ట్రెయినింగ్‌లో పాల్గొనాల‌నుకునే వారు mykartavya.nasscomfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకోవ‌చ్చు.

ఫార్వార్డ్ లేబుల్

ఫార్వార్డ్ లేబుల్

ఈ ఫీచర్ ని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం 5మందికి మాత్రమే ఫార్వార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫేక్ అయితే మీకు వెంటనే అలర్ట్ కనిపిస్తుంది.

ఇమేజ్ సెర్చ్ ఫీచర్

ఇమేజ్ సెర్చ్ ఫీచర్

వాట్సప్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్ మీద వర్క్ చేస్తుందని తెలుస్తోంది. దీని ద్వారా ఏదైనా మెసేజ్ వాట్సప్ లో వస్తే దాన్ని స్కాన్ చేస్తుంది. ఫేక్ అని తేలితే ఓ ఎర్రర్ మెసేజ్ లాగా చూపిస్తుంది. తద్వారా యూజర్లు ఈజీగా అది ఫేక్ అని గుర్తుపట్టవచ్చు.

ఇన్ యాప్ బ్రౌజర్

ఇన్ యాప్ బ్రౌజర్

యాప్ బ్రౌజర్ ద్వారా ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సప్ ప్రయత్నిస్తోంది. ఈ బ్రౌజర్ ద్వారా యూజర్లు అత్యంత సెక్యూరిటీగా పేజిలోకి వెళతారు. అయితే ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. పూర్తి స్తాయిలో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Here is how WhatsApp is fighting fake news on its platform, one feature at a time

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X