ఇక పండగే, కొత్త ఆఫర్లతో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్

మార్చి 31తో ఉచిత ఆఫర్లను నిలిపివేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన నేపధ్యంలో ప్రత్యర్ధి టెల్కోలైన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు పండుగ చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1, 2017 నుంచి జియోను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇక పండగే, కొత్త ఆఫర్లతో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్

జియో కమర్షియల్ లాంచ్ దగ్గర నుంచి తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న టెల్కోలకు త్వరలో మంచి రోజులు రాబుతోన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ జియో తన భవిష్యత్ కార్యచరణలో భాగంగా
జియో ప్రైమ్ పేరుతో సరికొత్త ప్లాన్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 1, 2017 నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ ప్లాన్ లోని కీలక అంశాలను పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Jio Prime మెంబర్‌షిప్

ముందుగా జియో యూజర్లు మార్చి 1, 2017 నుంచి మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి Jio Prime మెంబర్‌షిప్ ప్లాన్‌ను పొందవల్సి ఉంటుంది. జియో అఫీషియల్ వెబ్‌సైట్ లేదా సమీపంలోని జియో స్టోర్‌లలోకి వెళ్లటం ద్వారా ఈ మెంబర్‌షిప్‌ను పొందే వీలుంటుంది. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు జియో వాయిస్ కాల్స్ ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు వర్తించవు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. జియో ప్రైమ్ యూజర్లు డేటా సేవలను కూడా పొందాలంటే నెలకు రూ.303 చెల్లించాల్సి ఉంటుంది

Prime మెంబర్‌షిప్ ప్లాన్‌ తీసుకోని పక్షంలో..

ప్రతినెలా రూ.303 చెల్లించిటం ద్వారా మార్చి 31, 2018 వరకు జియో న్యూ ఇయర్ ఆఫర్ తాలుకూ అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. అంటే, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో మాదరిగానే వీరికి రోజుకు 1జీబి డేటా డేటా హైస్పీడ్ లో అందుబాటులో ఉంటుంది. ప్రతి నెలా లభించే 30జీబి డేటాను రోజుకు ఒక డేటా చొప్పున నెలమొత్తం వాడుకోవచ్చు. ఇదే సమయంలో జియో యాప్స్‌ను కూడా ఉచితంగా వాడుకోచ్చు. రోజు 1జీబి లిమిట్ దాటిన తరువాత డేటా వేగం కాస్తా 128 kbpsకు పడిపోతుంది. మార్చి 31లోపు Prime మెంబర్‌షిప్ ప్లాన్‌ను తీసుకోని జియో యూజర్లు ఏప్రిల్ 1, 2017 నుంచి జియో ఆఫర్ చేస్తున్న ఇతర టారిఫ్ ప్లాన్‌లను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

 

వొడాఫోన్ ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్...

వొడాఫోన్ తన ప్రీపెయిడ్ ఖతాదారుల కోసం మొత్తం 4 కొత్త 4జీ ప్లాన్‌లను అనౌన్స్ చేసింది. వాటి వివరాలు... రూ.150 ప్లాన్ (1జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ), రూ.250 ప్లాన్ (4జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ) , రూ.350 ప్లాన్ (6జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ), రూ.450 ప్లాన్ (9 జీబి 4జీ డేటా, 30 రోనజుల వ్యాలిడిటీ), రూ.650 ప్లాన్ (13జీబి 4జీ డేటా, 30 రోనజుల వ్యాలిడిటీ), రూ.999 ప్లాన్ (22 జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ), రూ.1500 ప్లాన్ (35 జీబి 4జీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ).

ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్...

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం రెండు సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే.. రూ.1495 ప్లాన్‌లో భాగంగా మూడు నెలల పాటు 30జీబి 4జీ డేటాను ఆస్వాదించవచ్చు

ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్...

ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్లమర్‌ల కోసం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ స్కీమ్‌లకు మైగ్రేట్ అవటం ద్వారా తమ ఖాతాదారులకు డిసెంబర్ 31, 2017 వరకు ప్రతినెలా 3జీబి 4జీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ నెల 4న ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ ఫిబ్రవరి 28, 2017 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రీపెయిడ్ కస్టమర్‌లు నెలకు రూ.345 చెల్లించటం ద్వారా అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్టీడీ) కాలింగ్‌తో పాటు 1జీబి 4జీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 3జీబి 4జీ డేటా తోడవుతుంది. రీఛార్చ్ చేయించుకున్న మొదటి సారి మాత్రం మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా 3జీబి డేటాను పొందాల్సి ఉంటుంది. తదుపరి నెలల నుంచి రూ.345 రీఛార్జ్ పూర్తవ్వగానే 3జీబి డేటా యాడ్ అయిపోతుంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. సంవత్సరంలో 13 సార్లు ఈ రీఛార్జ్‌ను పొందే వీలుంటుంది.

MyPlan Infinity ప్లాన్స్‌

MyPlan Infinity ప్లాన్స్‌లో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవట్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు ఉచిత 4జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్ టీడీ) కాలింగ్‌తో పాటు 3జీబి

+ 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. అదే రూ.799 ప్లాన్‌లో ఉన్నట్లయితే నెలకు 5జీబి + 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.9,000 విలువ చేసే ఎయిర్‌టెల్ 4జీ ఇంటర్నెట్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.

 

ఇడియా ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్...

ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు రూ.348 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 1జీబి 4జీ డేటాతో పాటు నెల మొత్తం వాయిస్ కాల్స్ అలానే మెసేజెస్ ఉచితం. కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌తో ఈ డేటా ప్యాక్‌ను పొందిన యూజర్లకు 3జీబి డేటా అదనంగా లభిస్తుంది. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. సంవత్సరంలో 13 సార్లు ఈ రీఛార్జ్‌ను పొందే వీలుంటుంది.

ఐడియా తన పోస్ట్‌పెయిడ్ ఖతాదారుల కోసం రూ.499 రెంటల్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో భాగంగా 3జీబి 4జీ డేటాతో పాటు దేశమొత్తం ఎటువంటి రోమింగ్ ఛార్జీలు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. నాన్ - 4జీ హ్యాండ్ సెట్ యూజర్లకు 1జీబి 3జీ డేటా మాత్రమే లభిస్తుంది. రూ.499 రెంటల్ ప్లాన్‌లో భాగంగా 8జీబి 4జీ డేటాతో పాటు దేశమొత్తం ఎటువంటి రోమింగ్ ఛార్జీలు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. నాన్ - 4జీ హ్యాండ్ సెట్ యూజర్లకు 5జీబి 3జీ డేటా మాత్రమే లభిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here is what Airtel, Idea and Vodafone are offering to counter Reliance Jio. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot