ఎయిర్‌‍టెల్ బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవటం ఎలా..?

గతంలో మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవాలంటే, రీఛార్జ్ షాపులకు వెళ్లి మంచి ఆఫర్లను ఎంపిక చేసుకోవల్సి వచ్చేది. డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రీఛార్జ్ ఆఫర్స్‌ను రకరకాల మార్గాల ద్వారా మన ఫోన్‌లలోనే చూసుకోగలుగుతున్నాం. ఇదే సమయంలో పేటీఎమ్, ఫ్రీఛార్జ్, మొబీవిక్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు సైతం తమ యూజర్లకు మొబైల్ రీఛార్జ్‌లను మరింత సులుభతరం చేసేసాయి.

Read More : మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరు చూడకుండా ఉండాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికత్త ట్రెండ్‌కు శ్రీకారం

మొబైల్ ఆపరేటర్లు సైతం అనేక రీఛార్జ్ స్కీమ్‌లతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సరికత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ప్రయివేట్ టెలికం ఆపరేటర్స్ యూజర్ వాడకాన్ని బట్టి స్పెషల్ ఆఫర్స్‌ను అందించే ప్రయత్నిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉన్నట్లయితే..

మీరు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబర్‌కు సంబంధించి స్పెషల్ ఆఫర్‌లను తెలుసుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

USSD కోడ్స్ ద్వారా...

ఎయిర్‌‍టెల్ యూజర్లు USSD కోడ్ ద్వారా తమ మొబైల్ నెంబర్‌కు వర్తించే స్పెషల్ ఆఫర్లను తెలుసుకునే వీలుంటుంది. లిమిటెడ్ ఆప్షన్స్‌తో కూడిన ఈ సుధీర్ఘ‌మైన ప్రక్రియ కొందరికి సౌకర్యవంతంగా అనిపించటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం సరికొత్త సౌలభ్యతను అందుబాటులోకి తీసుకువచ్చింది.

My Airtel App

ఎయిర్‌టెల్ యూజర్లు My Airtel Appను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా స్పెషల్ ఆఫర్లకు సంబంధించిన వివరాలను మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ రూపంలో పొందవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత యాప్ హోమ్ స్ర్కీన్ పై కనిపించే " Recharge " టాబ్ పై క్లిక్ చేయటం ద్వారా మీ మొబైల్ నెంబర్, సర్కిల్ ఇంకా స్టేట్‌ను బట్టి అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ను తెలుసుకునే వీలుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How Airtel Customers can Easily Check the Best Offers without Retailer Access. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot