Home
News

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఏడాది పాటు Amazon Prime ఉచితం

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL), తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అమెజాన్ ప్రైమ్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL), తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అమెజాన్ ప్రైమ్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్‌కు మాత్రమే వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌ను ఆస్వాదిస్తోన్న బీఎస్ఎన్ఎల్ యూజర్లకు వారి మెంబర్ షిప్‌ఎక్స్ పైర్ అయిన తరువాతనే ఈ కొత్త ఆఫర్ యాక్టివేట్ అవుతుందని సంస్థ తెలిపింది.

రూ.399 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్..

రూ.399 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్..

ఈ ఉచిత ఆఫర్‌ను పొందాలనుకునే మొబైల్ పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.399 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో ల్యాండ్‌లైన్ పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.745 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

 

 

లేటెస్ట్ సినిమాలతో పాటు బెస్ట్ ఆఫర్స్..

లేటెస్ట్ సినిమాలతో పాటు బెస్ట్ ఆఫర్స్..

బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ యూజర్లు ఈ ప్రైమ్ ఆఫర్‌ను తీసుకోవటం ద్వారా లేటెస్ట్ సినిమాలతో పాటు టీవీ షోలను అపరిమితంగా స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ డీల్స్ ఇంకా ఉచిత డెలివరీలు అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో యాడ్-ఫ్రీ మ్యూజిక్‌తో పాటు అన్‌లిమిటెడ్ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్‌ను వీరు పొందవచ్చు.

'BSNL-Amazon offer' బ్యానర్ పై క్లిక్ చేయాలి...

'BSNL-Amazon offer' బ్యానర్ పై క్లిక్ చేయాలి...

ఈ ఆఫర్‌ను పొందే క్రమంలో బీఎస్ఎన్ఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన 'BSNL-Amazon offer' బ్యానర్ పై క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేజీలో యూజర్ తన బీఎస్ఎన్ఎల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఓ OTP మెసేజ్ అందుతుంది. వ్యాలిడేషన్ పూర్తయిన తరువాత మెయిల్ ఐడీని ఎంటర్ చేసి సర్కిల్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ యాక్టివేట్ అవుతుంది.

2020 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు..

2020 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు..

2020 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 5జీ నెట్‌వర్క్ ఇంకా ఐఓటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే ఉద్దేశ్యంతో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఇంకా ఎన్‌టీటీ కమ్యూనికేషన్స్‌తో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Here's how BSNL customers can get Amazon Prime membership free.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X