రూ.33కే నెలంతా ఎయిర్‌టెల్ ఇంటర్నెట్
రిలయన్స్ జియోకు పోటీగా భారతి ఎయిర్‌టెల్ సరికొత్త టారిఫ్ ప్లాన్‌లతో దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఎంట్రీ లెవల్ డేటా మార్కెట్‍ను టార్గెట్ చేస్తూ ఇటీవల ఎయిర్‌టెల్ రూ.29 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.29 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 70MB 2G/3G/4G డేటా మీకు లభిస్తుంది.
Read More : మార్కెట్లోకి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు, 13 నుంచి ప్లిప్‌కార్ట్‌లో

తెర పైకి రూ.33 ప్లాన్..
తాజాగా మరో అడుగు ముందుకు వేసిన ఎయిర్‌టెల్ రూ.33 ప్లాన్‌ను అందుబాటలోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.33 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 85MB 2G/3G/4G డేటా లభిస్తుంది. ఇంటర్నెట్‌ను మరింత పొదుపుగా వాడుకునే వాళ్లకు ఈ ప్లాన్ బాగుంటుంది.

మీ ఎయిర్‌టెల్ నెంబర్‌కు రూ.33 ప్లాన్ పొందటం ఎలా..?
ముందుగా మీ ఎయిర్‌టెల్ నెంబర్ నుంచి *56733#కు డయల్ చేసి జాబితాలోని రూ.33 డేటా ప్లాన్ ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకుని ఓకే బటన్ పై క్లిక్ చేయండి.

టెక్స్ట్ మెసేజ్ మీకు అందుతుంది
మీరు ఆ రీఛార్జ్‌ను ఓకే చేసిన వెంటనే 'Recharge successful' పేరు ఓ టెక్స్ట్ మెసేజ్ మీకు అందుతుంది.

ఈ రీఛార్జ్ తాలూకా డబ్బులు..
ఈ రీఛార్జ్ తాలూకా డబ్బులు మీ మెయిన్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ప్లాన్ యాక్టివేషన్ అయిన వెంటనే డేటాను ఆన్ చేసుకుని పొదుపైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications








