గూగుల్ సంపాదన గురించి ఆసక్తికర విషయాలు

మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల ఆదాయ వనరుల గురించి విజువల్ క్యాపిటలిస్ట్స్ ఏం చెప్పింది..?

|

సాఫ్ట్‌వేర్ రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీలు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు కంపెనీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ టెక్ దిగ్గజాలు,తాము ఆఫర్
చేస్తోన్న సర్వీసెస్ అలానే ప్రోడక్ట్స్‌ను బట్టి బిలియన్ డాలర్ల మొత్తంలో ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. ఈ మూడు కంపెనీల ప్రధాన ఆదాయ వనరులకు సంబంధించి Visual Capitalists వెబ్‌సైట్ ఆసక్తికర
వివరాలను వెల్లడించింది. వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాం...

ఆపిల్

ఆపిల్

యాపిల్ బ్రాండ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఐఫోన్. ఆపిల్ ఐఫోన్‌లకు ఖరీదైన గాడ్జెట్స్‌గా ముద్రపడినప్పటికి ప్రపంచవ్యాప్తంగా వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ. యాపిల్‌కు లభిస్తోన్న మొత్తం ఆదాయంలో 63శాతం వాటా ఐఫోన్‌ల నుంచే వస్తోంది. మిగిలిన మొత్తాన్ని పరిశీలించినట్లయితే.. ఐప్యాడ్‌ల నుంచి 10 శాతం, ఐమ్యాక్ నుంచి 11శాతం, యాక్సెసరీస్ పై 5 శాతం, యాపిల్ మ్యూజిక్, ఐట్యూన్స్ ఇంకా ఐక్లౌడ్ జెనరేట్ పై 11శాతం ఆదాయం యాపిల్‌కు జనరేట్ అవుతుంది.

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడని టెక్నాలజీ ప్రియులంటూ ఉండరు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న కంప్యూటర్లలో ఎక్కువ శాతం కంప్యూటర్లు విండోస్ ఆపరేుటింగ్ సిస్టం పైనే రన్ అవుతుంటాయి. మైక్రోసాఫ్ట్‌కు లభిస్తోన్న మొత్తం ఆదాయంలో 28% వాటా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి వస్తోంది. మిగిలిన వాటాలను పరిశీలించినట్లయితే... విండోస్ సర్వర్ అలానే విండోస్ Azure నుంచి 22%, ఎక్స్ బాక్స్ డివిజన్ నుంచి 11%, విండోస్ ఆపరేటింగ్ సిస్టం, బింగ్ అలానే ఇతర అడ్వర్‌టైజింగ్ నుంచి 9%, 7%, 5% ఆదాయం మైక్రోసాఫ్ట్‌కు జనరేట్ అవుతుంది.

గూగుల్

గూగుల్

విజువల్ క్యాపిటలిస్ట్స్ విశ్లేషణ ప్రకారం గూగుల్కు ఎక్కువ శాతం ఆదాయం అడ్వర్‌టైజింగ్ ప్లాట్‌ఫామ్ నుంచే జనరేట్ అవుతుంది. గూగుల్ యాడ్‌వర్డ్స్ అలానే యూట్యూబ్ నుంచి గూగుల్‌కు 88% రివెన్యూ సమకూరుతోంది. పిక్సల్ ప్రొడక్ట్స్ అలానే గూగుల్ ప్లే సర్వీసుల నుంచి 11% ఆదాయం జనరేట్ అవుతోంది. గూగుల్ ఫైబర్ , Nest, Verily వంటి ప్రొడక్ట్స్ నుంచి 1% ఆదాయం గూగుల్‌కు జనరేట్ అవుతోంది.

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు..

బిల్ గేట్స్ గురించి ఆసక్తికర విషయాలు..

ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు ఎవరంటే ఇప్పుడు ఎవరైనా టక్కున చెప్పే సమాధానం బిల్ గేట్స్. ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కిన బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు..

ఆయన నికర ఆస్తుల విలువ ఎంతంటే..?

ఆయన నికర ఆస్తుల విలువ ఎంతంటే..?

బిల్‌గేట్స్ నికర ఆస్తులు విలువ మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 5,34,600 కోట్లకు పైమాటేనట. ఈ డబ్బు మొత్తాన్ని ఇండియాలోని పేద ప్రజలకు ఉచితంగా ఇస్తే ప్రజలంతా దర్జాగ బతికేస్తారట. ప్రపంచంలోని ఒక్కొక్కరికీ రూ. 650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా, విలాసవంతమైన జీవితం గడపగలరట!

సెకనుకు రూ.10వేల సంపాదన...

సెకనుకు రూ.10వేల సంపాదన...

బిల్‌గేట్స్ సెకనుకు ఆయన ఆర్జించే సంపాదన రూ. 10 వేల రూపాయలు. బిల్‌గేట్స్ తన ఆస్తులతో భారతీయులకు ఏమేం చేయగలరని పలు ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.

బిల్‌గేట్స్ తలచుకుంటే..

బిల్‌గేట్స్ తలచుకుంటే..

బిల్‌గేట్స్ తలచుకుంటే తన ఆస్తులతో బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరట. ఈ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 18-22 లక్షల వరకు ఉంటుంది. 30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగల సత్తా గేట్స్‌కు ఉందట. చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు ఒక్కొక్కరికీ రూ. 6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిఫ్ట్‌గా ఆయన ఇవ్వగలరట.

తరగిపోని ఆస్తులు...

తరగిపోని ఆస్తులు...

0-9 ఏళ్ల మధ్య పిల్లలకు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట. భారత జనాభా మొత్తానికి ఆహారం, టీ స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట.

Best Mobiles in India

English summary
Here’s How Google, Apple And Microsoft Make Money. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X