Just In
- 16 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 19 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 21 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Movies
Hunt Twitter Review: హంట్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైనవే మైనస్‌గా.. సుధీర్ బాబు పరిస్థితి ఏంటంటే!
- Finance
Indian iphone: ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్ లోనే తయారీ.. ??
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- News
ఇక ఆపేయండి - బాలయ్యకు మద్దతుగా : రంగంలోకి స్వయంగా..!!
- Sports
India Playing XI: పృథ్వీ షా రీ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Samsung ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్‌పై రూ.40వేల వరకు భారీ డిస్కౌంట్!
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung నుంచి గత నెలలో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే. Galaxy Z Flip 4 పేరుతో విడుదలైన ఆ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అందమైన డిజైన్ మరియు మెరుగైన ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది.

ఇది మునుపటి మోడల్ Samsung Galaxy Z Flip3 తో పోలిస్తే పలు అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో విడుదలైంది. ఈ డివైజ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం మంచి అవకాశం. ఎందుకంటే ఆకర్షణీయమైన ఆఫర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

రూ.40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు!
ఈ డివైజ్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999, కానీ మీరు ఇప్పుడు తాజా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.40 వేల విలువైన ఆఫర్లు, ప్రయోజనాలను పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు కూడా ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Samsung Galaxy Z Flip4 ధర, ఆఫర్లు:
Samsung Galaxy Z Flip4 సాధారణ ధర రూ.89,999 గా ఉంది. అయితే, కొన్ని ఆఫర్లను దక్కించుకోవడం ద్వారా మీరు చాలా తక్కువ ధర రూ.49,999 కే స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా దాదాపు రూ.33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే.. ఆ తగ్గింపు అనేది.. మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్న స్మార్ట్‌ఫోన్ మోడల్ మరియు దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
దీనితో పాటు, Samsung దాదాపు రూ.7 వేల వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, మీరు రిఫరల్ కోడ్‌ని ఉపయోగిస్తే లేదా Samsung షాప్ యాప్ నుండి డివైజ్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీరు మరో రూ.2,000 తగ్గింపు పొందవచ్చు.

నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది!
అంతేకాదు, రూ.4,611 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఉన్నందున మీరు Samsung Galaxy Z Flip4 కోసం నెలవారీ వాయిదాలలో చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు. మీరు Galaxy Watch4 క్లాసిక్ బ్లూటూత్ 42mm మోడల్‌ను కూడా Galaxy Z Flip4 తో పాటుగా కొనుగోలు చేసినట్లయితే.. రూ.2,999 తక్కువ ధరకు పొందవచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఇది గొప్ప డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ నిర్దిష్ట స్మార్ట్‌వాచ్ మోడల్ రిటైల్ ధర రూ.34,999 గా ఉంది.
ఏదేమైనప్పటికీ.. ఈ Samsung Galaxy Z Flip4 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను పొందాలనుకుంటే మీరు ప్రస్తుతం ఉన్న ఆఫర్లపై ఆర్హత కలిగిన వారు కేవలం రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు. తద్వారా దాదాపు రూ.40,000 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్లు:
Samsung Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. సెకండరీ స్క్రీన్ 2.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Samsung Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజీ లను కూడా కలిగి ఉంటుంది.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 12-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ స్నాపర్‌ని కలిగి ఉంది. ఇది 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 25W వైర్డు మరియు 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 3,700mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470