జియో GigaFiber కనెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే ఇలా ట్రై చేయండి..

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో, తన గిగాఫైబర్ (GigaFiber) సర్వీసుతో ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే.

|

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో, తన గిగాఫైబర్ (GigaFiber) సర్వీసుతో ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ గత నెలలోనే ప్రారంభమయ్యింది. వీటితో పాటుగా ఓ ప్రివ్యూ ఆఫర్‌ను కూడా జియో మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్రివ్యూ ఆఫర్ క్రింద జియో గిగాఫైబర్ కనెక్షన్‌ను తీసుకునే ప్రతి ఒక్కరికి 300జీబి ఉచిత డేటా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్‌, జియో స్టోర్స్‌లో ప్రారంభమైన iPhone ప్రీ-బుకింగ్స్..ఎయిర్‌టెల్‌, జియో స్టోర్స్‌లో ప్రారంభమైన iPhone ప్రీ-బుకింగ్స్..

300జీబి డేటాను నెలకు 100 జీబి చొప్పున.....

300జీబి డేటాను నెలకు 100 జీబి చొప్పున.....

ఈ 300జీబి డేటాను నెలకు 100 జీబి చొప్పున మూడు నెలల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. 100జీబి డేటాను 30 రోజుల కంటే ముందే మీరు వినియోగించేసుకున్నట్లయితే అదనంగా 40జీబి డేటాను మీరు పొందే వీలుంటుంది. ఈ కాంప్లిమెంటరీ డేటా టాపప్‌ను మైజియో యాప్ లేదా జియో.కామ్ ద్వారా పొందే వీలుంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది.

యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, జియో మనీ లేదా పేటీఎమ్ ద్వారా చెల్లించవచ్చు....

యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, జియో మనీ లేదా పేటీఎమ్ ద్వారా చెల్లించవచ్చు....

ఈ అమౌంట్‌ను యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, జియో మనీ లేదా పేటీఎమ్ ద్వారా చెల్లించవచ్చు. కనెక్షన్ తీసుకున్న తరువాత గిగాఫైబర్ సేవలు యూజర్‌కు నచ్చకపోయినట్లయితే, వెంటనే తమ కనెక్షన్‌‌ను టర్మినేట్ చేసుకుని సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి పొందవచ్చని జియో తెలిపింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ నిమిత్తం మీరు ఇప్పటికి ధరఖాస్తు చేసుకోనట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అయి ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు..

 

 

స్టెప్ 1

స్టెప్ 1

గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు కోసం ధరఖాస్తు చేసుకోవాలనుకుంటోన్నయూజర్లు ముందుగా రిలయన్స్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

స్టెప్ 2

స్టెప్ 2

జియో వెబ్‌సైట్‌ హోమ్ పేజీ ఓపెన్ అయిన తరువాత టాప్ స్లైడర్స్‌లో జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించిన నోటీస్ బ్యానర్ ఒకటి కనిపిస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఈ బ్యానర్ పై క్లిక్ చేసేందుకు వీలుగా 'invite Jio GigaFiber now' పేరుతో ఓ రెడ్ బటన్ ఉంటుంది. ఈ బటన్ పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4

స్టెప్ 4

రెడ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే సంబంధిత పేజీలో మీరు రిడైరెక్ట్ కాబడతారు. అక్కడ మీ లొకేషన్ ఇంకా అడ్రస్ వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5

స్టెప్ 5

అడ్రస్‌ వివరాలను ఎంటర్ చేసిన తరువాత ఆ వివరాలు మీ ఆఫీసువా లేక ఇంటివా అన్నది క్లియర్‌గా స్పెసిఫై చేసి 'Proceed' బటన్ పై క్లిక్ చేయండి.

 

 

స్టెప్ 6

స్టెప్ 6

తరువాత ఓపెన్ అయ్యేలో మరో పేజీలో మీ పేరుతో పాటు ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ రెండు వివరాలను ఎంటర్ చేసిన తరువాత జనరేట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని అంకెలతో కూడిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది.

 

 

స్టెప్ 7

స్టెప్ 7

ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసినట్లయితే మీ అభ్యర్థన విజయవంతంగా జియో గిగాఫైబర్ విభాగం దృష్టికి వెళుతుంది.

Best Mobiles in India

English summary
Here's how you can register for Reliance Jio GigaFiber.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X