క్రికెట్ ఆడుతూ రూ.2 వేల వరకు నగదు గెలుకోవచ్చు,ప్రాసెస్ మీకోసం

By Gizbot Bureau
|

గూగుల్ తన గూగుల్ పే యాప్ యూజర్లకు ఈ సమ్మర్ సీజన్లో అదిరిపోయో అవకాశాన్ని కల్పిస్తున్నది. ఆ యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన తేజ్ షాట్స్ అనే ఓ మినీ గేమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ గేమ్ ఆడి అందులో రన్స్‌ను స్కోర్ చేస్తే అందుకు తగిన విధంగా స్క్రాచ్ కార్డు వస్తుంది. దీని ద్వారా మీరు మని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే.. గేమ్‌లో 100 రన్స్ కొడితే రూ.50, 500 రన్స్ కొడితే రూ.100, 1000 రన్స్ కొడితే రూ.150, 2000 రన్స్ కొడితే రూ.1000, 3000 రన్స్ కొడితే రూ.2000 విలువైన స్క్రాచ్ కార్డులు వస్తాయి.

 క్రికెట్ ఆడుతూ రూ.2 వేల వరకు నగదు గెలుకోవచ్చు,ప్రాసెస్ మీకోసం

అయితే ఈ స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేయాలంటే అక్కడ సూచించే విధంగా యూజర్లు ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ స్క్రాచ్ కార్డు అన్‌లాక్ అవుతుంది. ఆపై దాన్ని స్క్రాచ్ చేసి రివార్డు పొందవచ్చు. ఇక ఈ గేమ్ ద్వారా గూగుల్ పే యూజర్లు రూ.3300 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ గేమ్‌ను ఎన్నిసార్లయినా ఆడవచ్చు. అందుకు పరిమితి ఏమీ లేదు. ఇక ఈ ఆఫర్‌కు జూలై 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే ఈ గేమ్ కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ పేను వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

  ఎలా జాయిన్ కావాలి

ఎలా జాయిన్ కావాలి

మీ Android మొబైల్ లో తాజా వెర్షన్ Google Pay యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాలి.మీ మొబైల్ పరికరంలో Google Pay Android యాప్ Google Pay ను తెరవండి. అక్కగ కనిపించే Tez Shotsపై నొక్కండి.

ఇప్పటికే గేమ్ ఆడుతున్న స్నేహితులు మీతో Tez Shotsకు లింక్ షేర్ చేయవచ్చు. అప్పుడు మీరు కూడా ఆడవచ్చు. గేమ్ గురించి మీరు మీ మొబైల్ పరికరంలో నోటిఫికేషన్‌ని స్వీకరిస్తే, దానిపై నొక్కండి. గేమ్‌ని చూడడానికి మీరు Google Pay Android యాప్ నుండి నిష్క్రమించి, మళ్లీ తెరిచి గేమ్ కంటిన్యూ చేయవచ్చు.

 

స్క్రాచ్ కార్డ్ అన్ లాక్ చేయడం ఎలా ?

స్క్రాచ్ కార్డ్ అన్ లాక్ చేయడం ఎలా ?

మీ స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేయడానికి నిర్దిష్ట లావాదేవీని Google Pay ద్వారా చేయండి. ప్రతి లావాదేవీ మొత్తం కనీసం ₹100 విలువైనది అయి ఉండాలి. కేటాయించిన లేదా అర్హత కలిగిన లావాదేవీలు ఈ కింద పేర్కొన్న చెల్లింపు పద్ధతులలో ఒకటై ఉండాలి. నిర్దిష్ట లావాదేవీ రకం మీ లాక్ చేయబడిన స్క్రాచ్ కార్డుపై కనబడుతుంది.Google Pay వినియోగదారుడిగా ఉన్నవారికి చెల్లించాలి.

చెల్లింపులు ఎలా ?
 

చెల్లింపులు ఎలా ?

Uber, Swiggy, BookMyShow, Zomato లేదా Redbus సైట్‌లు లేదా యాప్‌లలో మీ Google Pay UPI IDని ఉపయోగించి చేసిన చెల్లింపులు. చెల్లింపు ఎంపికగా మీరు మీ Google Pay UPI IDని నమోదు చేయాలి. బ్యాంక్ ఖాతాలకు చెల్లింపులు, Google Pay బిల్లు చెల్లింపు ఫీచర్‌లో చెల్లింపులు, Google Pay మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌లో చెల్లింపులు చేయాలి. అర్హత కలిగిన లావాదేవీలకు సంబంధించి మీరు చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత అన్‌లాక్ చేయబడిన స్క్రాచ్ కార్డుపై చూపిన రివార్డు మొత్తాన్ని మీరు సంపాదించుకుంటారు. ఒక్కోసారి స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేసి, రివార్డు ఏముందో తెలుసుకోవడానికి లావాదేవీని పూర్తి చేసిన తర్వాత 24 గంటల దాకా సమయం పట్టవచ్చు.

 మొత్తం స్కోర్

మొత్తం స్కోర్

మీ "మొత్తం స్కోర్"కు "ప్రస్తుత స్కోర్" జోడించబడాలంటే మీరు ఒక గేమ్‌ని ఆడడం పూర్తి చేయాలి. మీరు గేమ్ మధ్యలో నిష్క్రమిస్తే, ఆ పూర్తి చేయని గేమ్ స్కోర్ లెక్కలోకి తీసుకోబడదు.మీరు మైలురాయి స్కోరు చేరుకున్నారని నిర్ధారించుకోవడానికి స్కోర్ బోర్డులో మీ స్కోర్‌ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. రూల్స్ ఓ సారి చదివి గేమ్ లోకి ఎంటరవడం మంచిది.

Best Mobiles in India

English summary
Here’s how you can win up to Rs 3,300 using this Google app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X