ఆధార్ ఎక్కడ అవసరం, మరెక్కడ అవసరం లేదు,తెలుసుకోండి

|

ఆధార్ వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ సంఖ్య ప్రత్యేకమైనది, దీనికి నకిలీ తయారు చేయలేమని పేర్కొంది. ఇదే ఇతర ధ్రువీకరణలకు, ఆధార్‌కు తేడా అని జస్టిస్ ఏకే సిక్రీ పేర్కొన్నారు. తక్కువ డేటాను మాత్రమే తీసుకుంటారని, ఇది కూడా సర్వర్లలో నిక్షిప్తం అవుతుందని ఆయన అన్నారు. కొత్తగా సిమ్ కార్డ్ లేదా మొబైల్ కనెక్షన్‌ను ఇష్యూ చేసే సమయంలో పౌరుల నుంచి ప్రూఫ్స్ క్రింద ఆధార్ నెంబర్లను తీసుకోకూడదని సుప్రీంకోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ఆధార్ చట్టంలోని సెక్షన్ 57 రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చట్టబద్ధం కానీ వలసదారులు ఆధార్‌ను పొందే విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

 

సుప్రీం కోర్టు అభిప్రాయం...

సుప్రీం కోర్టు అభిప్రాయం...

'విద్య మనల్ని వేలిముద్ర నుండి సంతకం వరకు తీసుకెళ్తే.. టెక్నాలజీ మనల్ని సంతకం నుండి వేలిముద్రకు తీసుకొచ్చింది' అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

జస్టిస్‌ ఏకే  సిక్రీ...

జస్టిస్‌ ఏకే సిక్రీ...

ఆధార్‌పై తొలి తీర్పును జస్టిస్‌ ఏకే సిక్రీ, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ చదివి వినిపించారు. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే, ఆధార్‌ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్‌ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్‌ ఆధార్‌ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు

ఈ మూడు విషయాలకు ఆధార్ కచ్చితంగా అవసరం...
 

ఈ మూడు విషయాలకు ఆధార్ కచ్చితంగా అవసరం...

- పాన్ కార్డుకి ఆధార్ తప్పనిసరి.
- ఆదాయ పన్ను వివరాల కోసం ఆధార్ ఉండాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించాలి.
- పిడిఎస్ వంటి ప్రభుత్వ సంక్షేమ సేవలకు ఆధార్ అవసరం

ఈ 7 విషయాలకు ఆధార్ తో  అవసరం లేదు....

ఈ 7 విషయాలకు ఆధార్ తో అవసరం లేదు....

- స్కూల్ అడ్మిషన్‌కి ఆధార్ తప్పనిసరి కాదు.
- టెలికాం కంపెనీలు ఆధార్‌ను అడగొద్దు.
- బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ అక్కర్లేదు.
- యూజీసీ, నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదు.
- కొత్త సిమ్ కార్డుకు ఆధార్ తప్పనిసరి కాదు.
- ప్రవేట్ కంపెనీలు ఆధార్ డేటాను పొందలేవు.
- పిపిఎఫ్, ఎన్ సి ఎస్ వంటి ఆర్థిక సేవలకు ఆధార్ అవసరం లేదు.

 

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Here's a list of services where Aadhaar is not required.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X