Home
News

జియోకు షాక్, త్వరలోనే BSNL 5G నెట్‌వర్క్ ఫీల్డ్ ట్రెయిల్స్..

2020 నాటికి 5జీ నెట్‌వర్క్ ఇంకా ఐఓటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఇంకా ఎన్‌టీటీ

2020 నాటికి 5జీ నెట్‌వర్క్ ఇంకా ఐఓటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఇంకా ఎన్‌టీటీ కమ్యూనికేషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా స్మార్టీ సిటీలకు సంబంధించిన సొల్యూషన్స్ పైన కూడా ఈ ఒప్పంద కంపెనీలు కలిసి పనిచేస్తాయని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

ప్రపంచదేశాలతో పాటుగానే..

ప్రపంచదేశాలతో పాటుగానే..

మార్కెట్లో టెలికం సేవలను అందిస్తోన్న చాలా వరకు బీఎస్ఎన్ఎల్ కాంపిటీటర్స్ ఇప్పటికీ 4జీ సర్వీసెస్ మానిటైజింగ్ పైనే దృష్టిసారిస్తుంటే, లీడింగ్ కంపెనీలు 5జీ రోల్ అవుట్ నిమిత్తం తమ వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. టెలికంశాఖ మంత్రి మనోజ్ సిన్హా, గ్లోబల్ స్థాయిలో నిర్వహించిన 5జీ మిటింగ్స్ ఫలితంగా తమకు ఈ అవకాశం లభించిందని, ప్రపంచంలో 5జీ సేవలు ఎప్పుడైతే మొదలవుతాయో, దాదాపు అదే సమయంలో భారత్‌‍లోనూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

5జీ ఇకోసిస్టం కోసం నోకియా, సిస్కోలతో ఒప్పందం.

5జీ ఇకోసిస్టం కోసం నోకియా, సిస్కోలతో ఒప్పందం.

5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన టెస్ట్ కేస్‌లను భారత్‌లో ఎక్కడా నిర్వహించాలి అనే దాని పై ప్రస్తుతం తాము వర్క్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఎస్ఎన్ఎల్ తన 5జీ ఇకోసిస్టంను అభివృద్థి చేసుకునే క్రమంలో నోకియా ఇంకా సిస్కోలతో కీలక ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే.

త్వరలోనే 5జీ ఫీల్డ్ ట్రెయిల్స్..

త్వరలోనే 5జీ ఫీల్డ్ ట్రెయిల్స్..

5జీ ఫీల్డ్ ట్రెయిల్స్‌ను ప్రారంభించేందుకు గాను తాము అడ్వాన్సుడు స్టేజెస్‌లో ఉన్నామని, అగ్రిమెంట్‌లో భాగంగా ట్రెయిల్స్‌కు సంబంధించిన 5జీ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన వెంటనే ట్రెయిల్స్ ప్రారంభమవుతాయని శ్రీవాస్తవ తెలిపారు. 5జీ సర్వీసులకు అవసరమైన స్పెక్ట్రమ్ కేటాయింపుకుగాను రూ.4.9 లక్షల కోట్లు ఖరీదు చేసే 8,644 MHz స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీలను ఆక్షన్‌లో భాగంగా అందుబాటులో ఉంచాలని టెలికం రెగ్యులేరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. ప్రభుత్వం దీని పై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

మార్చి 2019 నాటికి 4జీ సేవలు..

మార్చి 2019 నాటికి 4జీ సేవలు..

బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్ సేవలను మార్చి, 2019 నుంచి కమర్షియల్‌గా ప్రారంభించబోతోంది. ఈ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన 4జీ స్పెక్ట్రమ్‌ అక్టోబర్ చివరినాటికి బీఎస్ఎన్ఎల్‌లకు లభించబోతోంది. ఆ తరువాత నుంచి నెట్‌వర్క్ టెస్టింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. 4వ తరం (4జీ) స్పెక్ట్రమ్‌‌ను పొందంటం ద్వారా దేశవ్యాప్తంగా తమకున్న 100 మిలియన్ కస్టమర్‌లకు మెరుగైన డేటా సేవలను అందించవచ్చని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

 

 

అన్‌లిమిట్‌ (Unlimit)తో ఒప్పందం..

అన్‌లిమిట్‌ (Unlimit)తో ఒప్పందం..

బుధవారం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్స్‌కు చెందిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) కంపెనీ అన్‌లిమిట్‌ (Unlimit)తో బీఎస్ఎన్ఎల్ కీలక ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ (వాల్యూ యాడెడ్ సర్వీస్ విభాగం) డీకే అగర్వాల్ తమ 4జీ నెట్‌వర్క్‌ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.4జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను ఇప్పటికే ఆర్డర్ చేసామని, మార్చి 2019 నాటికి కమర్షియల్‌గా తమ 4వ తరం సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి 2100 మెగాహెర్ట్జ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్‌ లభించబోతోందని, ఈ బ్యాండ్‌విడ్త్‌లో తమ 4జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Here's when BSNL may roll out 5G in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X