Home
News

ఇలా చేస్తే ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ని రూ.17 వేల తగ్గింపుతో సొంతంచేసుకోవచ్చు

By Gizbot Bureau

స్మార్ట్ ఫోన్ రారాజు ఆపిల్ ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరికీ చాలా మక్కువ ఉంటుంది. అయితే కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నా దాని ధరలు చాలా ఎక్కువ కావడంతో అందరూ ఏం చేయలేకపోతుంటారు. అలాంటి వారి కోసం సువర్ణావకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆపిల్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపులో అందుబాటులోకి వచ్చింది.

Heres a new way to get Rs 17,000 discount on Apple iPhone XR

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ కోలాహలంలో భాగంగా, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 6 ఎస్ , ఐఫోన్ 7లపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ ఫోన్ మీద ఏకంగా రూ. 17వేల వరకు తగ్గింపు లభిస్తోంది. మరి తగ్గింపు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

iPhone XR లాచింగ్ ధర

iPhone XR లాచింగ్ ధర

ఆపిల్ కంపెనీ iPhone XRను గతేడాది నవంబర్ లో లాంచ్ చేసింది. లాంచింగ్ సమయంలో దీని ధరను కంపెనీ రూ. 76,900గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధర పడిపోయింది. 64జిబి వేరియంట్ ధర రూ.59,900గానూ అలాగే 128జిబి వేరియంట్ ధర రూ. 64,900గానూ ఉంది.

కార్డు డిస్కౌంట్

కార్డు డిస్కౌంట్

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు HDFC Bank credit and debit cards మీద కొనుగోలు చేస్తే తక్షణమే 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.ఇప్పుడు HDFC Bankతో పాటు State Bank of India (SBI) customersకి కూడా కంపెనీ ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి తక్షణం 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఇప్పుడు ఈ ఫోన్ 64 జిబి వేరియంట్ ధర రూ. 53,900కు దిగివచ్చింది.

ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో

ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో

కాగా ఇంతకుముందు ఈ రెండు బ్యాంకులు offlineలో మాత్రమే ఈ తగ్గింపును అందించాయి. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని Apple authourised reseller storesలో ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా ఈఎమ్ఐలో కొనుగోలు చేయాలనుకునే వారికి నో కాస్ట్ ఈఎమ్ఐ అందుబాటులో ఉంది. IDFC First Bank కూడా ఈ ఆఫర్ అందిస్తోంది. స్టాక్ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనికి లిమిట్ లేదు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ రూ .40,000 వరకు డిస్కౌంట్ అందించడంతో ఈ ఫోన్లు నిమిషాల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ బోర్డులు దర్శనమిచ్చాయి.

 ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ రియర్‌ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్‌, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Here's a 'new way' to get Rs 17,000 discount on Apple iPhone XR
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X