సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసినందుకు రూ. 40 వేలు ఊడ్చేశారు

సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసినందుకు రూ.40 వేలు పోగొట్టుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే లక్నోలోని జానకిపురానికి చెందిన ఓ మహిళ ఆన్ లైన్ ద్వారా మూవీ టికెట్లు బుక్ చేసుకుంది.

|

సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసినందుకు రూ.40 వేలు పోగొట్టుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే లక్నోలోని జానకిపురానికి చెందిన ఓ మహిళ ఆన్ లైన్ ద్వారా మూవీ టికెట్లు బుక్ చేసుకుంది. ఓ పాపులర్ సైటు ద్వారా టికెట్ బుక్ చేసుకోగా అనివార్య కారణాల వల్ల ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటూ డబ్బులు రీఫండ్ చేయాలని నిర్వాహకులను కోరింది.

సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసినందుకు రూ. 40 వేలు ఊడ్చేశారు

అయితే ఈ రీఫండ్ సమయంలో ఆమె ఖాతా నుంచి రూ. 40 వేలు మిస్సయ్యాయి. షాక్ తిన్న ఆ మహిళలు వెంటనే లక్నోలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మరి ఎలా ఊడ్చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేసుకోండి.

కష్టమర్ కేర్ కి కాల్

కష్టమర్ కేర్ కి కాల్

టికెట్లు క్యాన్సిల్ చేయడం కోసం కస్టమర్ కి కేర్ కాల్ చేసిన ఓ మహిళ క్యాన్సిల్ చేసిన డబ్బులు రీఫండ్ చేయాలని కోరింది. అయితే టికెట్ బుక్ చేసిన సైటు నుంచి ఏజెంట్ అంటూ ఒకతను ఆమెకు కాల్ చేశారు.

డెబిట్ కార్డు వివరాలు

డెబిట్ కార్డు వివరాలు

ఆ మహిళకు సాయం చేస్తానంటూ ఏజెంటు నమ్మబలికాడు. ఇందులో భాగంగా డబ్బుల రీఫండ్ కోసం ఆమె డెబిట్ కార్డు వివరాలను అడిగాడు. అయితే ఆమె ఆ వివరాలను గుడ్డిగా చెప్పేసింది.

రూ. 40 వేలు స్వాహా

రూ. 40 వేలు స్వాహా

కాల్ పూర్తయ్యేలోపే ఆమె అకౌంట్ నుండి ఈ ఏజెంటు రూ.40 వేలు స్వాహా చేశాడు. ఇలా కార్డు వివరాలు అడిగి అందులో ఉన్న మొత్తాన్ని ఊడ్చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ తిని సైబర్ పోలీసులను ఆశ్రయించింది.

కాల్ చేసిన వ్యక్తి ఏం చేస్తాడు

కాల్ చేసిన వ్యక్తి ఏం చేస్తాడు

కాల్ చేసిన వ్యక్తి ముందుగా వారి వ్యక్తిగత వివరాలను అంటే పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వాటిని వెరిఫై చేస్తాడు. సాధారణంగా కాల్స్ ఎక్కువగా మొబైల్ నంబర్ నుంచే వస్తాయి.

కస్టమర్ల ఐడీ

కస్టమర్ల ఐడీ

కాల్ చేసిన వ్యక్తి మీ కస్టమర్ ఐడీని అలాగే ఆన్ లైన్ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను అడుగుతారు.దీంతో మరికొన్ని బ్యాంకు వివరాలను అడుగుతారు. మనకు న్యాయం చేస్తున్నాడని భావించి వ్యక్తిగత వివరాలను అందరూ చెప్పేస్తుంటారు. అయితే ఇది చాలా తప్పు

ఓటీపీ

ఓటీపీ

చివరకు మీ నంబరుకు వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అది చెప్పారంటే ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతుంది.కాగా సాధారణంగా బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ లో ఇవేమి అడగరు. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Best Mobiles in India

English summary
How a woman lost Rs 40,000 to fraud after cancelling movie tickets online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X