ఎన్నికలపై గూగుల్ ప్రత్యేక దృష్టి, జర్నలిస్టులకు ఉచిత ట్రయినింగ్
2019 సార్వత్రిక సమరం మరి కొద్ది నెలల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ దీనిపై ప్రత్యేక దృష్టిని సారించింది.
2019 సార్వత్రిక సమరం మరి కొద్ది నెలల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ దీనిపై ప్రత్యేక దృష్టిని సారించింది. అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ లీడ్స్, ఇంటర్‌న్యూస్ సహకారంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 'గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్' పేరుతో దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్‌షాపుల్లో ట్రెయినింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది జూలై 20 నుంచి సెప్టెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గూగుల్ శిక్షణ తరగతులను నిర్వహించింది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ..
త్వరలో పార్లమెంట్‌తోపాటూ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్‌లో భాగంగా పోల్ చెక్.. కవరింగ్ ఇండియాస్ ఎలక్షన్ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహించనుంది.

యూట్యూబ్ వాడే విధానం
ఆన్‌లైన్ వెరిఫికేషన్, ఫ్యాక్ట్ చెకింగ్, డిజిటల్ సేఫ్టీ అండ్ సెక్యురిటీ, ఎన్నికల కవరేజీకి యూట్యూబ్ వాడే విధానం, డేటా విజువలైజేషన్‌వంటి అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గూగుల్ తెలిపింది.

అన్ని నగరాల్లో
ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వరకు 30 నగరాల్లో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, బంగ్లా, కన్నడ, గుజరాతీ, ఒడిషా, తమిళం, తెలుగు, మరాఠీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ఎలక్షన్ శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు..
Agartala, Tripura | Sat, Mar 16 | English
Ahmedabad, Gujarat | Sat, Mar 9 | Gujarati/English (bilingual)
Aizawl, Mizoram | Sat, Mar 9 | English
Bengaluru, Karnataka | Fri, Mar 8 | English/Kannada (bilingual)
Bhopal, Madhya Pradesh | Sun, Mar 17 | Hindi/ English (bilingual)
Bhubaneswar, Odisha | Sat, Mar 9 | Odia/English (bilingual)
Chandigarh, Punjab/Haryana | Sat, Mar 9 | English
Chennai, Tamil Nadu | Mon, Mar 11 | Tamil/English (bilingual)
Dehradun, Uttarakhand | Sat, Mar 30 | English
Delhi NCR, Delhi | Tue, Feb 26 | English track + Hindi track
Gangtok, Sikkim | Sat, Mar 2 | English
Guwahati, Assam | Sat, Mar 9 | English
Hyderabad, Telangana/Andhra Pradesh | Wed, Mar 13 | Telugu/ English (bilingual)
Imphal, Manipur | Sat, Mar 23 | English
Indore, Madhya Pradesh | Sat, Mar 16 | English
Itanagar, Arunachal Pradesh | Sat, Apr 6 | English
Jaipur, Rajasthan | Fri, Mar 15 | Hindi
Jammu, Jammu & Kashmir | Sat, Mar 9 | English
Kochi, Kerala | Sat, Mar 2 | English/Malayalam (bilingual)
Kohima, Nagaland | Sat, Mar 2 | English
Kolkata, West Bengal | Wed, Mar 6 | English/Bangla (bilingual)
Lucknow, Uttar Pradesh | Mon, Mar 4 | Hindi
Mumbai, Maharashtra | Fri, Mar 15 | English/Marathi (bilingual)
Panaji, Goa | Sat, Mar 23 | English
Patna, Bihar | Fri, Mar 1 | Hindi
Pune, Maharashtra | Sat, Mar 16 | English/Marathi (bilingual)
Raipur, Chhattisgarh | Sat, Mar 16 | Hindi
Ranchi, Jharkhand | Tue, Mar 12 | Hindi
Shillong, Meghalaya | Sat, Mar 16 | English
Visakhapatnam, Andhra Pradesh | Sat, Mar 23 | English/Telugu (bilingual)

యూట్యూబ్ వాడే విధానం
ఈ ట్రయినింగ్ లో జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నవారితో పాటూ జర్నలిజం విద్యార్థులు ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు.

ఎలా గుర్తించాలి
ట్రెయినింగ్ సమయంలో నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్‌లో మార్చి 13న, విశాఖపట్నంలో మార్చి 23న తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications








