క్లౌడ్ కంప్యూటింగ్‌లో పాఠాలు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్లాన్
The Indian Institute of Technology Kharagpur విద్యార్థుల కోసం కొత్త కోర్పును ప్రవేశపెట్టింది. Amazon Web Services (AWS)పేరుతో ఎడ్యుకేషన్ పోగ్రాంని అందిస్తోంది. ఈ కోర్సులో ప్రధానంగా క్లౌడ్ సర్వీసులు అల
The Indian Institute of Technology Kharagpur విద్యార్థుల కోసం కొత్త కోర్పును ప్రవేశపెట్టింది. Amazon Web Services (AWS)పేరుతో ఎడ్యుకేషన్ పోగ్రాంని అందిస్తోంది. ఈ కోర్సులో ప్రధానంగా క్లౌడ్ సర్వీసులు అలాగే ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద విద్యార్థలకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సంధర్భంగా ఐఐటీ కెజిపి డైరక్టర్ పిపి చక్రబర్తి మాట్లాడుతూ..AWS Educate programmeని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని AWS Cloud Computing experience and AIలలో శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇన్నోవేటివ్ సొల్యూషన్స్
అలాగే ఈ కోర్సులో చేరే విద్యార్థులకు ఇన్నోవేటివ్ ఐడియాలు వచ్చే విధంగా ట్రయినింగ్ ఇస్తామని తెలిపారు. వారు సరికొత్త ఐడియాలో బయటకు వస్తారని ఆ విధంగా వారిని తీర్చిదిద్దుతామని అన్నారు.

అమెజాన్
AWS Educate programmeకు Amazon's global initiative ద్వారా సహాయ సహకారాలు అందనున్నాయి.క్లౌడ్ రిలేటెడ్ లెర్నింగ్ సర్వీసు ద్వారా మెళుకువలు అలాగే బయటకు వెళితే ఎలా వర్క్ చేయాలి అనే దాని మీద ఇది వారికి గైడెన్స్ ఇవ్వనుంది. ప్రధానంగా క్లౌడ్ సర్వీసుల ద్వారా స్కిల్స్ పెంచుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది.

కొత్త టెక్నాలజీ
రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో దానికనుగుణంగా వారికి కోచింగ్ ఇవ్వనున్నారు. ఎఐ టెక్నాలజీ రాబోయే రోజుల్లలో ప్రధాన పాత్ర పోషించనుండటంతో దాని మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చేలా ఇక్కడ కోచింగ్ ఇవ్వనున్నారు.

12 విధాలుగా ఉపయోగాలు
ఈ కోర్సు పూర్తి అయిన తరువాత విద్యార్థులు క్లౌడ్ రంగంలో దాదాపు 12 విభాగాల్లో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. machine learning, cyber security, and software development ఇంకా ఇతర రంగాల్లో వీరు స్థిరపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








